మహేష్ బాబు - పవన్ లపై 6 నెలలు కఠిన నిషేధం సాధ్యమేనా?!
వరద బాధితుల సహాయార్ధం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నిర్వహించిన స్టార్ నైట్ కు హాజరుకాని నటీనటులపై ఆరు నెలల పాటు నిషేదం విధిస్తామని దర్శకరత్న దాసరి నారాయణరావు గంభీరంగా ప్రకటించారు. అయితే ఈ స్టార్ నైట్ కార్యక్రమానికి ప్రిన్స్ మహేష్ బాబుతో సహా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాలేదు. వ్యక్తిగతంగానే ఇలాంటి పబ్లిక్ కార్యక్రమాలకు వీరిద్దరూ కాస్త దూరంగానే ఉంటారు.
అయితే, జాతీయ విపత్తు నేపథ్యంలో నిధుల సమీకరణ కోసం చేపట్టిన స్టార్ నైట్ లో ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం చేయాలని చిత్రపరిశ్రమ పిలుపునిచ్చింది. ఇందుకోసం ఏకంగా మూడు రోజుల పాటు సెలవుదినాలను కూడా ప్రకటించింది. అయినప్పటికీ కొంతమంది నటీనటులు డుమ్మా కొట్టారు. వీరిలో ఇద్దరు ప్రధాన హీరోలుగా ఉండటం దర్శకరత్నకు ఏమాత్రం రుచించడం లేదు.
'కిలాడి" షూటింగ్ నిమితం మహేష్ బాబు రాజస్థాన్ కు వెళ్లగా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాల రీత్యా గైర్హాజయ్యారు. అయితే, ఆరోగ్య కారణాలను మినహాయింపు ఇస్తామని దాసరి ప్రకటించారు. కానీ మహేష్ బాబు షూటింగ్ కు వెళ్ళగా, పవన్ కళ్యాణ్ హాజరుకాక పోవడం గమనార్హం. వీరిపై 'మా" లేదా దాసరి ఎలాంటి చర్య తీసుకుంటారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











