జెనీలియాపై 'మా' తొలి వేటు
హీరోయిన్ జెనీలియాపై మూవీస్ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) వేటు వేసింది. తమ సంఘంలో సభ్యత్వం తీసుకోనందుకు జెనీలియాపై మా ఆంక్షలు విధించింది. జెనీలియాకు సహకరించవద్దని మా తన సభ్యులకు సూచించింది. జెనీలియా ప్రస్తుతం నా ఇష్టం చిత్రంలో నటిస్తోంది. చాలా మంది హీరోయిన్లు తమ సంఘంలో చేరనందుకు మా చాలా కాలంగా గుర్రుగా ఉందని, సభ్యత్వం తీసుకోనివారిపై నిషేధం విధిస్తామంటూ గతంలో ఆదేశాలు జారీ చేసింది. సభ్యత్వం తీసుకునేందుకు గడువును కూడా విధించింది. గడువు ముగిసిపోవడంతో జెనీలియాపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
ఎక్కువగా తెలుగు సినిమాల్లో పరాయి భాషా హీరోయిన్లే నటిస్తున్నారు. చాలా మంది హీరోయిన్లు మాలో సభ్యత్వం తీసుకోలేదు. దాంతో మా సభ్యత్వం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఎవరెవరిపై మా ఆంక్షలు విధిస్తుందో వేచి చూడాల్సిందే. కొంత మంది హీరోయిన్లు ఇప్పటికే సభ్యత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది. సభ్యత్వం తీసుకోవాలని అడిగినప్పుడు జెనీలియా కాస్తా తలబిరుసుగా మాట్లాడినట్లు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











