మా మ్యూజిక్ అవార్డ్స్ (ఫోటోలు)
హైదరాబాద్: మా మ్యూజిక్ అవార్డ్స్-2013 వేడుకలో ప్రముఖ గాయని ఎస్ జానకిని లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సన్మానించారు. ఈ నెల 19న హైదరాబాద్ లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డు ప్రధానం చేసారు. మా టీవీ నెట్వర్క్ అందిస్తున్న సెకండ్ అవార్డ్ ఫంక్షన్ ఇది. ఈ కార్యక్రమానికి తెలుగు చిత్ర సీమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
2012లో వచ్చిన సినిమాలను పరిగణలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు. దేవిశ్రీ ప్రసాద్‌కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు దక్కింది. వడ్డేపల్లి శ్రీనివాస్, శ్వేతా పండిత్ బెస్ట్ సింగర్స్ గా అవార్డు అందుకున్నారు. హరిచరణ్-చిత్ర బెస్ట్ డ్యూయెట్ సాంగ్ అవార్డ్, రామజోగ్య శాస్త్రి ఉత్తమ పాటల రచయితగా ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా ప్రముఖ గాయని ఎస్ జానకిని లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో సత్కరించారు. జానకి ఇప్పటి వరకు దేశీయ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీల్లో దాదాపు 20 వేలకు పైగా పాటలు పాడారు. ఆమె సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఆమెకు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.
మా మ్యూజిక్ అవార్డు కార్యక్రమానికి నాగార్జున, అనుష్క, రోజా, జయసుధ, సుశాంత్, నిర్మాత అల్లు అరవింద్, ఎస్ గోపాల్ రెడ్డి, కోదండరామిరెడ్డి, దర్శకులు రాఘవేంద్రరావు, హరీష్ శంకర్, క్రిష్, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, మణిశర్మ, కోటి, సింగర్స్ బాబా సెహగల్, పి. సుశీల, వాణి జయరాం, చిత్ర తదితరులు పాల్గొన్నారు.

మాటీవీ మ్యూజిక్ అవార్డ్ ఫంక్షన్లో జానకిని సన్మానిస్తున్న దృశ్యం.

జానకికి అవార్డు ప్రధానం చేస్తున్న అల్లు అరవింద్, కె విశ్వనాథ్ తదితరులు.

మా మ్యూజిక్ అవార్డ్ ఫంక్షన్లో నాగార్జున.

మా మ్యూజిక్ అవార్డ్ ఫంక్షన్లో అనుష్క.

మా మ్యూజిక్ అవార్డ్స్ ఫంక్షన్లో బండ్ల గణేష్, హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ తదితరులు.


Click it and Unblock the Notifications











