'చిరంజీవి' బ్యాంకాక్ భామలతో..
లాఫింగ్ లార్డ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మా నాన్న చిరంజీవి" (అంటే పేద్ద హీరో). షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుంది. జగపతిబాబు, నీలిమ నాయకానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిదే. ఈ సందర్భంగా ప్రైమ్ స్టార్ జగపతిబాబు మాట్లాడుతూ "అరుణ్ ప్రసాద్ కథ చెప్పగానే వెంటనే స్టార్ట్ చేద్దాం అన్నాను. ఈ కథ నాకు అంత బాగా నచ్చింది. చెప్పిన దానికంటె చాలా బాగా ప్రెజెంట్ చేసాడు. ఈ మధ్య కాలంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసాను అరుణ్ ప్రసాద్ ప్రతి సీను చాలా బాగా తీసాడు.
ఓ పిల్లాడికీ నాకు వుండే అనుబంధం ఈ చిత్రంలో ప్రధానాంశం. 'శుభలగ్నం"లా సెంటిమెంటు వుంటూ వినోదంతో కూడుకున్న యాక్షన్ చిత్రం ఇది.మాస్టర్ అతులిత్ ఆ పిల్లాడి పాత్ర చాలా చక్కగా పోషించాడు. కథానాయిక నీలిమ అద్భుతంగా నటించింది. నేను, అతులిత్ పాల్గొనగా బ్యాంకాక్‌లో తీసిన పాట సినిమాకే హైలైట్ అవుతుంది. నా కెరీర్‌లో మంచి సినిమాగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారన్న నమ్మకం వుంది" అన్నారు.


Click it and Unblock the Notifications











