టైమింగ్ ఉన్న నటుడు.. భావోద్వేగంతో చిరంజీవి, పవన్, శ్రీకాంత్ సంతాపం

తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ ప్రయాణం చేసిన కమెడియన్ వేణు మాధవ్ ఇక లేరనే వార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. సుమారు 20 ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ కమెడియన్‌గా 400 పైగా సినిమాల్లో నటించారు. చిన్నతనం నుంచే సినిమాలంటే ఆసక్తిగా ఉండే ఆయన వెండితెర కలను సాకారం చేసుకొన్నారు. ఇంకా ఎంతో సినీ ప్రయాణం చేయాల్సిన ఆయన అర్ధాంతరంగా జీవితాన్ని ముగియడంపై సినీ పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది. మా, పవన్ కల్యాణ్ తమ సంతాప ప్రకటనలో ఆయన ప్రతిభను కొనియాడారు. వారేమన్నారంటే..

న‌టుడు వేణుమాధ‌వ్ మ‌ర‌ణం తీర‌ని లోటు : మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌
న‌టుడిగా, క‌మెడియ‌న్‌గా సినీ రంగ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన న‌ట‌న‌తో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్నారు వేణుమాధ‌వ్‌. ఆయ‌న ఆకాల మ‌ర‌ణం ఎంతో బాధాక‌రం. ఆయ‌న మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం తీర‌ని లోటు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానున‌భూతిని వ్య‌క్తం చేస్తున్నాం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.

Maa, Pawan Kalyan condolences Comedian Venu Madhav

వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలి
వేణు మాధవ్ మృతిపై పవన్ కల్యాణ్ స్పందించారు. అందరినీ నవ్వించిన వేణుమాధవ్ ఇక లేరనే విషయం దిగ్భ్రాంతిని కలిగించింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ కోలుకుంటారని అనుకున్నాను. నటుడిగా ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన మరణించడం బాధాకరం. గోకులంలో సీత నుంచి నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. హాస్యం పండించడంలో మంచి టైమింగ్ ఉన్న నటుడు. మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్లో అందరినీ సరదాగా ఉంచేవారు. వర్తమాన రాజకీయ విషయాలపై ఆసక్తి చూపేవారు. వేణుమాధవ్ మృతికి నా తరఫున, జనసైనికుల తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. వేణు మాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

Maa, Pawan Kalyan condolences Comedian Venu Madhav

తన కోసమే పుట్టాయనేంతగా

వేణు మాధవ్ మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. వేణుమాధ‌వ్ తొలిసారి నాతో క‌లిసి మాస్ట‌ర్ సినిమాలో న‌టించాడు. అటుపై ప‌లు సినిమాల్లో న‌టించి హాస్య‌న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నాడు. కొన్ని పాత్ర‌లు త‌న‌కోసమే పుట్టాయ‌న్నంతగా న‌టించేవాడు. ఆ పాత్ర‌కే వ‌న్నే తీసుకొచ్చే వాడు. వ‌య‌సులో చిన్న వాడు. సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కింకా బోలెడంత భ‌విష్య‌త్ ఉంద‌ని అనుకునే వాడిన కానీ దేవుడు చిన్న చూపు చూసాడు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూర‌ల‌ని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాన‌న్నారు అని అన్నారు.

చాలా సినిమాలు కలిసి నటించాం
న‌టుడిగా, క‌మెడియ‌న్‌గా సినీ రంగ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన న‌ట‌న‌తో వేణుమాధ‌వ్‌ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయ‌న ఆకాల మ‌ర‌ణం ఎంతో బాధాక‌రం. మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం తీర‌ని లోటు. వేణు మాధవ్ కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానున‌భూతిని వ్య‌క్తం చేస్తున్నాం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అని హీరో శ్రీకాంత్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X