twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మా’ లొల్లి: రాజేంద్ర్రసాద్ చిరును కలవడంపై నరేష్ విమర్శలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా) ఎన్నికలు పొలిటికల్ ఎన్నికలకు ఏ మాత్రం తీసి పోకుండా రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల తతంగం పుణ్యమా అని దాదాపు 20 రోజుల పాటు అందరికీ మంచి ఎంటర్టెన్మెంట్ లభించింది. ఈ ఎన్నికల్లో జయసుధ ఓటమి పాలవ్వగా...రాజేంద్రప్రసాద్ ‘మా' అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

    ‘మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌పై తాజాగా ‘మా' జాయింట్ సెక్రటరీ నరేష్ (జయసుధ ప్యానెల్ నుండి గెలుపు) విమర్శకుల దిగారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'కు మద్దతు ఇవ్వాలని కోరారు. మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ప్రవర్తన సరిగా లేదని, కేసీఆర్ దగ్గరికి వెళ్లినపుడు అతను ఇతర కార్యవర్గానికి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని విమర్శించారు. పర్సనల్ గా విజిట్ చేస్తే తప్పేమీ లేదు, ఇపుడు మీరు ‘మా' ప్రెసిడెంట్. కార్యవర్గ సభ్యులను కలుపుకుని పోవాలని, ఒంటరిగా వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు.

    MAA Reality Show: Naresh Finds Fault In Rajendra Prasad

    అదే విధంగా రాజేంద్రప్రసాద్ చిరంజీవిని కలవడాన్ని కూడా తప్పుబట్టారు. ‘నేను చిరంజీవి గారికి వ్యతిరేకం ఏమీ కాదు. మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. కానీ రాజేంద్రప్రసాద్ చిరంజీవిని ఒంటరిగా ఎందుకు కలిసారనేదే నా ప్రశ్న. చాలా మంది సీనియర్ యాక్టర్లు కృష్ణ, మోహన్ బాబు, మురళీ మోహన్ లాంటి వారు ఉన్నారు. చిరంజీవిని కలవడం ద్వారా మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? అంటూ ప్రశ్నించారు.

    ఇటీవల ‘మా' కార్యవర్గం ఎన్నికైంది. మొదట్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే......మున్ముందు ‘మా'లో మరిన్ని వివాదాలు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. మా అధ్యక్షుడుగా రాజేంద్రప్రసాద్, ఆయన ప్యానెల్ నుండి శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్, కాదంబరి కిరణ్ తప్ప ఇతర కార్యవర్గం మొత్తం దాదాపుగా జయసుధ ప్యానెల్ నుండి గెలుపొందిన వారు. ఈ నేపథ్యంలో మున్ముందు ‘మా' వర్గ పేరు నడుస్తుదని తాజా పరిస్థితులు పరిశీలిస్తే స్పష్టమవుతోంది.

    English summary
    Ever since MAA elections took a political outlook, it has been a great source of entertainment for the outsiders. The daily dose of controversies and allegations, made it a mega super hit reality show on the television news channels.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X