twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మా’లో మరో కొత్త వివాదం.. నియంతృత్వ ధోరణికి నిరసనగా.. రాజశేఖర్ అత్యవసర సమావేశం

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఎన్నికల జరిగిన తీరును, ఒకరినొకరు దూషించుకున్న విధానం అన్నీ చూస్తే.. మాలో ఎన్ని లొసుగులున్నాయో అందరికీ తెలిసిపోతోంది. ఎన్నికలు జరగక ముందు శివాజీ రాజా, నరేష్ ప్యానెల్ మధ్య మాటల యుద్దం జరిగాయి.

    నరేష్‌కు రాజశేఖర్ సూచన..

    నరేష్‌కు రాజశేఖర్ సూచన..

    తీరా నరేష్ ప్యానల్ గెలిచాక.. వారి మధ్యే చిచ్చులు మొదలయ్యాయి. తమను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నాడని, అందర్నీ కలుపుకుంటూ ముందుకు సాగాలని రాజశేఖర్ బాహాటంగానే నరేష్‌కు సూచించాడు.

    హేమ అసంతృప్తి..

    హేమ అసంతృప్తి..

    ఎన్నికల్లో విజయం సాధించాక ఏర్పాటుచేసిన మొదటి సమావేశంలోనే.. హేమ కూడా తన అసంతృప్తిని వెల్లగక్కింది. స్టేజ్‌పై తన నుంచి మైక్ లాగేసుకోవడంపై తీవ్ర అసంతృప్తికి లోనైంది. అయితే నరేష్ సొంత నిర్ణయాలే తీసుకుంటున్నాడని, మీటింగ్‌లకు హాజరు కావడం లేదని ప్రధాన ఆరోపణలు.

    షోకాజ్ నోటీసులు..

    షోకాజ్ నోటీసులు..

    అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మధ్య మరో వివాదం నెలకొంది. నరేష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు రాజశేఖర్ సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. మాలో కొత్త బాడీ ఏర్పాటు అయి ఆరు నెలల కావస్తోంది. కానీ ఇప్పటివరకు మాలో ఎలాంటి ఫండ్స్ కలెక్ట్ చేయలేదు. చాలా రోజుల నుంచి నరేష్ మా మీటింగ్స్‌కు రావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ ఏవో పనులు ఉన్నాయంటూ ఆయన మా సమావేశాలకు హాజరుకావడం లేదని వార్తలు బయటకు వచ్చాయి.

    అవన్నీ ఆరోపణలే..

    అవన్నీ ఆరోపణలే..

    నరేష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారని వచ్చిన వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. తమ మధ్య ఎలాంటి వివాదాలు లేవని, కావాలని ఎవరో సృష్టించిన వార్తలేనని స్పష్టం చేశారు. అయితే తాజాగా కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

    నియంతృత్వ ధోరణికి..

    నియంతృత్వ ధోరణికి..

    మా లో ఏకపక్ష నిర్ణయాలు.. నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా మా కార్యవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. నరేష్ తీసుకుంటోన్న ఏకపక్ష నిర్ణయాలు, ఆయన నియంతృత్వ ధోరణి, మా ఫండ్ విషయాలపై అత్యవసర సమావేశాన్ని ఉపాధ్యక్షుడు రాజశేఖర్ ఏర్పాటుచేశారు. అయితే అధ్యక్షుడు లేకుండా ఎలా సమావేశం ఏర్పాటు చేస్తారంటూ నరేష్ తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

    English summary
    Rajasekhar And Vk Naresh Row In Maa. His Rude Behavior And Taking Decission With Out Meeting. They Oppose Naresh Behavior
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X