twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లవర్ బాయ్ సిద్దార్థకు ‘షోకాజ్ నోటీస్’లు...!?

    By Srikanya
    |

    తమిళం నుంచి వచ్చి తెలుగులో హీరోగా నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్న సిద్ధార్థ్ కు మామూలుగానే ఎగస్ట్రాలెక్కువ. తానో మేధావిలా ఫీలవుతుంటాడు. 'కమలహాసన్ తర్వాత మళ్లీ అంతటి ఆర్టిస్టుని నేనే' అన్న ఫీలింగ్ అతనిలో ఎక్కువని అంటుంటారు. అలాంటి సిద్ధూ ఈమధ్య తన ప్రకోపాన్ని జర్నలిస్టుల మీద చూపించాడు. ఇటీవల తను శృతిహాసన్ తో కలిసి సహజీవనం చేస్తున్నాడంటూ... తెలుగు చానెల్స్ న్యూస్ ఇవ్వడంతో మండిపడి, 'కొన్ని టీవీ చానెల్స్ ఓ గంట ప్రోగ్రాం కోసం తమ ఫ్యామిలీలను కూడా అమ్ముకుంటాయి' అంటూ ట్విట్టెర్ లో పిచ్చిరాతలు పోస్ట్ చేశాడు. థర్డ్ గ్రేడ్ ఛానెల్స్ ఇలాంటి ఆర్టికల్స్ టెలికాస్ట్ చేయడం వల్ల నా ఇమేజ్ కి ఎలాంటి డ్యామేజ్ జరగదని ఈ హీరో చెప్పడు. దాంతో ఎలక్ట్రీనిక్ మీడియా, ప్రింట్ మీడియా జర్నలిస్ట్ లు సిద్ధు మాటలన ఖడించాచు.

    అందుకు సిద్ధూ 'సారీ' చెప్పాలంటూ తెలుగు సినిమా జర్నలిస్టులంతా డిమాండ్ చేసినా, దిగిరాకపోవడంతో అతనిని బ్యాన్ చేశారు. అతని ప్రెస్ మీట్స్ ని ఎవరూ కవర్ చేయడం లేదు. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లంతా కలిసి ఈ విషయంలో ఫిలిం చాంబర్ కూ, నిర్మాతల మండలికీ, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కూ కంప్లైంట్ చేశారు. దీనిపై స్పందించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ రోజు సిద్దూకి షోకాజ్ నోటీస్ ఇచ్చిందని తెలుస్తోంది. మరి, సిద్ధూ దీనికి ఎలా స్పందిస్తాడో చూడాలి.

    English summary
    A day before the Before the release of Siddharth's film '180', Popular news channel NTV had telecasted a programme about it predicting a flop. Siddharth came down strongly on them in twitter, "3rd grade 'N'ews channels will sell their families to make up an hour of tv. Clarifying their garbage & lies is not worth our time. Ignore!"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X