హీరోయిన్లపై 'మా' నిషేదాస్త్రం
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లు గా కొనసాగుతున్న తమన్నా, సమంత, ఇలియానా, తాప్సీ, జెనీలియా, నిత్యమీనన్, పార్వతి మెల్టన్, స్నేహ తో పాటు పలువురు హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులపై తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నిషేదాస్త్రం విధించాలని నిర్ణయించింది. వీరంతా 'మా"లో సభ్యత్వం తీసుకోక పోవడమే ఇందుకు కారణం.
ఈ విషయమై 'మా" అధ్యక్షుడు మురళీ మోహన్ మీడియాతో మాట్లాడుతూ....ఇప్పటికే చాలా సార్లు ఈ విషయమై వారికి తెలియచేశామని, అయినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఇప్పటి వరకు కాజల్, అనుష్క మాత్రమే సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. సభ్యత్వం తీసుకోని వారందరికీ ఇప్పటికే నోటీసులు పంపామని, ఈ నెలాఖరులోగా వారి నుంచి స్పందన రాక పోతే నిషేదం విధించడంతో పాటు, సహాయ నిరాకరణ చేస్తామని మురళీ మోహన్ హెచ్చరించారు.
హీరోయిన్లతో పాటు కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా సభ్యత్వం తీసుకోలేదన్నారు. హీరోలందూ సభ్యత్వం తీసుకున్నారని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు మురళీ మోహన్.


Click it and Unblock the Notifications











