»   » బన్నీ-త్రివిక్రమ్ మూవీ రైట్స్ భారీ ధరకు కొన్న మాటీవీ

బన్నీ-త్రివిక్రమ్ మూవీ రైట్స్ భారీ ధరకు కొన్న మాటీవీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి'(వర్కింగ్ టైటిల్). ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ భారీ ధరకు ‘మా టీవీ' ఛానల్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఛానల్ వారు ఏకంగా రూ. 9.5 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. బన్నీ, త్రివిక్రమ్ సినిమాలకు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండటంతో ఇంత పెద్ద ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం స్పెయిన్ లో పాట‌ల చిత్రీక‌ణ జ‌రుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తో ఒక్క పాట షూటింగ్ మిన‌హ షూటింగ్ మెత్తం పూర్త‌వుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం,రావ్ రమేష్ నటిస్తున్నారు. అని కార్యక్రమాలు పూర్తి చేసి స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత ఎస్.రాధాకృష్ణ తెలియజేశారు.

ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ... అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో సినిమా రూపొందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. తివిక్ర‌మ్ అత్తారింటికి దారేది చిత్రం త‌రువాత అల్లు అర్జున్ రేసుగుర్రం చిత్రం త‌రువాత చేస్తున్నందున‌ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు.

Maa TV bagged S/O Satyamurthy rights

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్నాం. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అందాల భామలు సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్ర‌స్తుతం స్పెయిన్ లో పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తో ఒక్క పాట షూటింగ్ మిన‌హ షూటింగ్ మెత్తం పూర్త‌వుతుంది. మరి కొద్దిరోజుల్లో ఆడియో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. అని కార్యక్రమాలు పూర్తి చేసి స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాము.. అని అన్నారు.

నటీనటులు అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

English summary
Maa TV has bagged the Satellite rights of forthcoming movie “S/O Satyamurthy” starring stylish hero Allu Arjun, Samantha, Nithya Menon and Adah Sharma under the direction of Trivikram Srinivas. The Maa TV has purchased the rights for a fancy price of Rs.9.5 crores.
Please Wait while comments are loading...