మా టీవీలో ‘సోలో’...రూ. 1.75 కోట్లు
నారా రోహిత్, నిషా అగర్వాల్ జంటగా నటించిన 'సోలో" సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్ రైట్స్ ను మాటీవీ వారు దక్కించుకున్నారు. రూ. 1.75 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమాను దక్కించుకుంది మా టివి. లో బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ఇంత పెద్ద మొత్తంలో శాటిలైట్ రైట్స్ ద్వారా ఆదాయం రావడానికి కారణం ఈ సినిమా మంచి ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్ టైనర్ గా సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతుండటమే. త్వరలోనే మనం 'సోలో" సినిమాను మా టీవీలో చూడ బోతున్నాం.
పరశురాం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టీం రేపటి నుంచి సక్సెస్ టూర్ కు ప్లాన్ చేసింది. ఈ టూర్ ముగిసిన తర్వాత డిసెంబర్ 10న వైజాగ్ లో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ చేయనున్నారు. బాణం సినిమాలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న రోహిత్ ఈ సినిమాతో లవర్ బాయ్ గా మార్కులు కొట్టేశాడు. ఈ విజయంతో మరిన్ని అవకాశాలు రోహిత్ ను వెతుక్కుంటూ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











