‘మా ఊళ్లో ఓసారి ఏం జరిగిందంటే...’రెడీ

By Srikanya

కుంతల్, సిరిశ్రీ జంటగా నవ్య ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై చెందు దర్శకత్వంలో ఎంవిఎల్‌కె.రావు నిర్మిస్తున్న చిత్రం 'మా ఊళ్ళో ఓసారి ఏం జరిగిందంటే". ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన తొలికాపీ సిద్ధమైంది. ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్స్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ -'కోనసీమ అందాలను ఆవిష్కరించిన అందమైన ప్రేమకథ ఇది. తొలికాపీ సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల చేస్తాం. ఓ ఊళ్లో జరిగిన చిన్న సంఘటన ఆధారంగా ఈ చిత్ర కథను రూపొందించాం.

పచ్చని పొలాల మధ్య కంటికి అందంగా కెమెరా అందమైన దృశ్యాలను చూపిస్తుంద"ని తెలిపారు. జయపాల్, మారుతి వేదం జ్ఞానశేఖర్, రమణ, వ్యాసమూర్తి, ఉమాదేవి, అనంత్, దుర్గారావు, ఆకొండి పవన్‌కుమార్, సాయి స్వరూప్, విజయ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జయపాల్, సంగీతం: మారుతీరాజా, ఎడిటింగ్: పి.శ్రీనివాస్, నిర్మాత: ఎం.వి.ఎల్.కె.రావు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చెందు. వంశీ చిత్రాల తరహాలో రూపొందించిన పోస్టర్ తో ఈ చిత్రం ఆకట్టుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X