మొన్న చావు మేళం.. ఇప్పుడు పెళ్లి మేళం.. ఆ వార్తలపై మాధవీలత సీరియస్!

స్టార్ హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినా కూడా నటి మాధవీలత ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో అయితే ఫాలోవర్స్ ని సంపాదించుకుంటోంది. ఒకవైపు రాజకీయ, సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూనే.. మరోవైపు.. తన జీవితంలోని పర్సనల్ విషయాల గురించి కూడా బయటపెడుతోంది. ఇక ఇటీవల మాధవీలత పెళ్లి రూమర్స్ పై కూడా క్లారిటీ ఇచ్చింది.

పెళ్లిపై రూమర్స్..

పెళ్లిపై రూమర్స్..

రెండు రోజుల క్రితం మాధవీలత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. తాను చాలా ఆనందంగా ఉన్నాను అని త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఆ కామెంట్స్ చూసి అందరు ఆమె పెళ్లి ఫిక్స్ అయ్యిందని అనుకున్నారు. మీడియాలో కూడా అదే తరహాలో వార్తలు వచ్చాయి. ఇక ఫైనల్ గా ఆ వార్తలపై మాధవీలత వివరణ ఇచ్చింది.

కాస్త ఆగండి..

కాస్త ఆగండి..

ఓ విధంగా ఈ లేడి పొలిటీషియన్ కొంత చిరాకు పడినట్లు తెలుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్లు అందరు అనుకుంటూ ఉన్నారు. కాస్త ఆగండి ఏదైనా సరే ధైర్యంగా బయటకు చెప్పి చేస్తాను. అంతే గాని ముసుగులో ఉండి చేయడానికి ఏ మాత్రం ఇష్టపడను. ఈ విషయంలో తొందరపడకండి అంటూ మాధవీలత ఒక పోస్ట్ చేసింది.

ధైర్యంగా చెప్తాను.

ధైర్యంగా చెప్తాను.

నాకు దమ్ము దైర్యం రెండు ఎక్కువే, ప్రేమించిన పెళ్లి చేసుకున్న దైర్యంగా చెప్తాను. అలాగే అంత దమ్ము దైర్యం ఉన్న మగాడంటేనే ఇష్టపడతా కూడా.. అంతే కానీ ఇష్టాన్ని ప్రేమని దొంగలా దాచుకుని సమాజానికి భయపడే పిరికివాళ్ళంటే నాకు చిరాకు. మాధవీలతని ప్రేమిస్తున్న పెళ్లి చేసుకుంటా అని దమ్ముగా చెప్పే వాడితోనే స్నేహం కూడా గొప్పగా ఉంటుందని తెలిపింది.

చెప్పేది ఏమనగా..

చెప్పేది ఏమనగా..

ఇక కనుక మీడియా మిత్రులకి నా అభిమానులకి ఫాలోయర్స్ చెప్పేది ఏమనగా కాస్త ఆగండి తొందరపడకండి ఏదైనా చెప్పే చేస్తాను. నేను పిరికిదాన్ని కాదు. ఆలా అని పిరికివాడిని నేను ఒప్పుకోను. కనుక ఇంకా అంత దమ్ము ,దైర్యం ,సాహసం ,సత్తా ,విలువ ,శక్తి ,బలం ,అధికారం ఉన్న మనిషి కనపడలేదు నాకు ముసుగులో రిలేషన్స్ మెయింటైన్ చేసే మనుషులన్నా కూడా నాకు అసహ్యమే అని తెలిపింది.

Recommended Video

Sri Reddy On Balakrishna-Nagababu Issue || ఆయన కింగే మీరే బొంగు... నగ్న సత్యం చెప్పిన శ్రీ రెడ్డి
పెళ్లి మేళం..

పెళ్లి మేళం..

ఫైనల్ గా ఏదైనా సరే చెప్పి చేస్తాను. మొన్నామధ్య చావు మేళం న్యూస్ వేశారు. అంత మన మంచికే అన్నట్లు ఇపుడు పెళ్లి మేళం వార్త వేశారు. ఏమో తధాస్తు దేవతలు తదాస్తు అంటే మీడియా మిత్రులకి మంచి పెళ్లి భోజనం పెడతాము.. అంటూ మాధవీలత తన పోస్ట్ లో క్లియర్ గా వివరణ ఇచ్చింది. ఇక చివరగా మీ మీడియా వాళ్ళు నా పెళ్లి చేసిన చేసేస్తారు సుమీ అంటూ ఫీనిషింగ్ టచ్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X