మిస్టర్ పవన్ కల్యాణ్.. ఏం పీ**టారో పీక్కోండి.. హీరోయిన్ మాధవి సంచలన వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లడంతో పాటు తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటోన్నాడు.

ఈ మధ్య కాలంలో సినిమాల్లో, రాజకీయాల్లో తనదైన మార్కును చూపిస్తున్నాడు. ఇక, సెప్టెంబర్ 2వ తేదీన పవన్ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతడిపై హీరోయిన్ మాధవి లత చేసిన పోస్ట్ వివాదంగా మారింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

Pawan Kalyan

పవన్ బర్త్‌డే.. సెలెబ్రిటీల పోస్టులు: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2 అంటే శనివారం తన పుట్టినరోజును జరుపుకున్నాడు. దీన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు పండుగ చేసుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ చెబుతూ పోస్టులు చేశారు. అలాగే, ఎంతో మంది సినీ ప్రముఖులు సైతం పవన్ కల్యాణ్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Maadhavi Latha Pawan Kalyan

మాధవి లత పోస్ట్.. మిస్టర్ అంటూ: పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని అతడి అభిమానిగా చెప్పుకునే తెలుగు హీరోయిన్ మాధవి లత కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో 'హ్యాపీ బర్త్‌డే టూ యూ మిస్టర్ పవన్ కల్యాణ్. గాడ్ బ్లెస్ యూ' అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్టు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిందనే చెప్పాలి.

Maadhavi Latha Pawan Kalyan

మాధవిపై అభిమానులు ఆగ్రహం: సోషల్ మీడియాలో మాధవి లత చేసిన పోస్టుపై పవన్ కల్యాణ్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందులో 'మిస్టర్ పవన్ కల్యాణ్' అని రాయడంతో వాళ్లంతా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి మాధవి లతకు పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆమె ఎన్నో సార్లు వెల్లడించింది. అయితే, ఇప్పుడు చేసిన పోస్టు మాత్రం వివాదంగా మారింది.

Maadhavi Latha Pawan Kalyan

ఆ మిస్టర్ కూడా తీసేస్తా అంటూ: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ తనను ట్రోల్ చేయడంతో మాధవి లత వాళ్లకు కౌంటర్లు ఇస్తోంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు 'దీనమ్మ జీవితం.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే కూడా ఇంత పెంట చేస్తున్నారు. మీ బతుకులు సామీ, గారు అంటే ఆ మిస్టర్ కూడా తీసేస్తాను. నేను అయితే అమ్మగారు, నాన్నగారు అని పిలవను' అంటూ ఘాటుగానే సమాధానం చెప్పింది.

Maadhavi Latha Pawan Kalyan

నాకు నచ్చితే అలానే పిలుస్తాను: అదే రిప్లైలో మాధవి లత 'మీరు అయితే బాయ్‌ఫ్రెండ్ గారు, మొగుడు గారు, తమ్ముడు గారు అనను. అలాగే, ఫ్రెండ్ గారు అంటారేమో నేను మాత్రం అనను. నా మనసుకు నచ్చితే ఏకవచనంతోనే పిలుస్తాను. మీ కామెంట్లు చూశాక మిస్టర్ అని కూడా పిలవొద్దు అనిపిస్తుంది. డైరెక్టుగా కలిస్తే గారు అంటాం కానీ, సోషల్ మీడియాలో అలా పెడతామా' అని ప్రశ్నించింది.

పీక్కోండి అంటూ సీరియస్‌గానే: మాధవి లత కంటిన్యూ చేస్తూ.. 'నేను చేసిన బర్త్‌డే విషెస్ కంటే పక్కన ఉన్న పెంట మీద పల్లీలు ఏరుకునే జాబ్ అంటేనే ఇష్టం.. మాకు మీ విషెస్ కనిపించవు తొక్కలు, ఎక్కలు కనిపిస్తాయి అంటే.. పీక్కోండి.. ఏరుకోండి.. నేనైతే తగ్గే సమస్యే లేదు. నాకూ తిక్క ఉంది.. ఆ తిక్కకు అసలు లెక్క అనేదే లేదు' అంటూ ముగించింది. ఆ తర్వాత కూడా కొన్ని కామెంట్లకు రిప్లై ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X