పవన్ కళ్యాణ్‌కి హీరోయిన్ ప్రేమ లేఖ.. ఒక పక్క సంతోషం, మరోపక్క దుఃఖం అంటూ సెన్సేషన్

Recommended Video

Madhavi Latha's Love Letter To Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే జనాల్లో అదో క్రేజ్. వెండితెరపై ఆయన కనిపించారంటే చాలు థియేటర్లన్నీ హోరెత్తిపోతుంటాయి. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ పవన్ అంటే పడిచేస్తుంటారు. అశేష అభిమాన వర్గం ఆయన సొంతం. కేవలం సాధారణ జనమే కాదు సినిమా కొందరు హీరోయిన్స్‌కి కూడా పవన్ అంటే ప్రాణం. అందులో ఒకరే మాధవీలత. తాజాగా ఈమె పవన్ కళ్యాణ్ కోసం రాసిన ప్రేమ కవితను బయటపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. వివరాల్లోకి పోతే..

పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం

పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం

ప్రస్తుత బీజేపీ నేత, హీరోయిన్ మాధవీలతకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్నోసార్లు ఆమె స్వయంగా ప్రకటించింది కూడా. అయితే ఈ సారి మాత్రం పవన్ కళ్యాణ్‌కు రాసిన ప్రేమ కవితను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది మాధవీలత.

మాధవీలత ప్రేమ కవిత ఇదే..

మనసులో ఏదో వేదన
కారణం తెలియక పడుతున్నా తపన

హృదయంలో అనురాగం అనే భావన
దానికో రూపం ఇచ్చేందుకే ఈ సాధన

నీవు కనిపించగానే నా హృదయంలో ఏదో బాధ
నా మనస్సుని ఎవరో గట్టిగా పట్టేసినట్టుగా వేదన

ఒక పక్క సంతోషం, మరో పక్క దుఃఖం కానీ,.. కానీ ఎందుకో తెలీదు
నిను చూస్తున్న ప్రతీక్షణం నేను కారణం చెప్పలేని భావాలలో విలవిల్లాడిపోతాను. దానికి అర్థం ఏంటి? నేను ఎందుకిలా అవుతున్నాను?

ఇది ఆకర్షణా? ప్రేమ అనే వ్యామోహమా?
No. కానే కాదు. అటువంటిది కాదు. మరేంటి? అని కవిత రాసింది మాధవీలత.

అసలు ట్విస్ట్ ఇదీ..

అసలు ట్విస్ట్ ఇదీ..

ఈ కవిత పవన్ కళ్యాణ్ కోసం రాసిందయినప్పటికీ, ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. ఈ కవిత ఇప్పటిది కాదు. ఎప్పుడో 19 ఏళ్ల క్రితం (2000 సంవత్సరంలో) మాధవీలత రాసుకున్న ప్రేమ కవిత. ఈ విషయాన్ని పేర్కొంటూ తన లేఖను పేస్‌బుక్‌లో పెట్టేసింది మాధవీలత.

ఇక ఈ సారి ఫ్రెష్‌గా..

''ప్రేమ.......

ప్రేమలో గెలిచిన వారికి ప్రేమ ఒక వరం
ప్రేమలో ఓడిన వారికీ ప్రేమ ఒక విషం
కానీ ప్రేమ ని త్యాగం చేసిన వారికీ
అది మధుర కావ్యం .....

ఎప్పటికి గుండెల్లో గుర్తుండిపోయే కమ్మని జ్ఞాపకం'' అంటూ మరో ఫ్రెష్‌గా కవిత పోస్ట్ చేసింది మాధవీలత.

నెట్టింట వైరల్.. ఓ రేంజ్ కామెంట్స్

నెట్టింట వైరల్.. ఓ రేంజ్ కామెంట్స్

మాధవీలత పోస్ట్ చేసిన ఈ ప్రేమ కవితలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై లైకులు కురిపిస్తూ ఓ రేంజ్ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. లవ్లీ, సూపర్, స్వీట్ మెమోరీస్ అంటూ ఎవ్వరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X