ఇటు కేసీఆర్ అటు జగన్.. మధ్యలో గోలీ పెట్టి రచ్చచేసిన హీరోయిన్.. సంచలన కామెంట్స్

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా కరోనా గురించిన చర్చలే నడుస్తున్నాయి. మీడియాలో కరోనాకు సంబంధించిన వార్తలే పతాక శీర్షికల్లో నిలుస్తున్నాయి. అన్ని దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమై కరోనాపై పెద్దఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై హీరోయిన్ మాధవీలత చేసిన కామెంట్స్ హాట్ ఇష్యూగా మారాయి. ఇంతకీ మాధవీలత ఏం చేసింది? అసలు సంగతేంటి? వివరాల్లోకి పోతే..

ప్రజల్లో భయం.. సినీ, రాజకీయ పెద్దలు

ప్రజల్లో భయం.. సినీ, రాజకీయ పెద్దలు

కరోనా కోరలు చాస్తుండటంతో అన్నిదేశాల ప్రభుత్వాల వైద్య ఆరోగ్య శాఖలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ.. ఈ వైరస్ విజృంభణకు బ్రేకులు పడటం లేదు. దీంతో ప్రజలు భాయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయం పోగొట్టేందుకు గాను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ తమ వాయిస్ వినిపిస్తున్నారు.

హాట్ టాపిక్‌గా మారిన పారాసెటెమాల్

హాట్ టాపిక్‌గా మారిన పారాసెటెమాల్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజల్లో నెలకొన్న భయాలు, అపోహలు తొలిగిపోయేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ చేసిన పారాసెటెమాల్ వ్యాఖ్య ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. వీరి వ్యాఖ్యలపై ఎవరికితోచిన వారు కామెంట్స్ చేస్తున్నారు.

భయం భయం.. ముఖ్యమంత్రుల తీరు

భయం భయం.. ముఖ్యమంత్రుల తీరు

కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని, జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా వేసుకునే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బ్లీచింగ్ పౌడర్ చల్లుకుని పరిశుభ్రత పాటిస్తే కరోనా మన దరికి చేరదని, 22 డిగ్రీల ఉష్టోగ్రత దాటితే కరోనా వైరస్ బతకలేదని, దీనికి పారాసిటమాల్ టాబ్లెట్ చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.

ప్రపంచ దేశాలు అలా.. ఈ ముఖ్యమంత్రులు ఇలా

ప్రపంచ దేశాలు అలా.. ఈ ముఖ్యమంత్రులు ఇలా

దీంతో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడిన మాటలను అస్త్రాలుగా మలుచుకుంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు. పారాసిటమాల్ టాబ్లెట్ విషయాన్ని వైరల్ చేస్తూ పెద్ద పెద్ద చర్చలను తెరలేపుతున్నాయి. దీంతో.. ఓ వైపు ప్రపంచం మొత్తం ఈ కరోనాకు భయపడి ప్రజల్ని అప్రమత్తం చేస్తుంటే.. ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌లు ‘పారాసిటమాల్' పాట పాడుతున్నారంటూ జనం ట్రోల్స్ చేస్తున్నారు.

రంగంలోకి హీరోయిన్..

రంగంలోకి హీరోయిన్..

ఈ పరిస్థితుల్లో హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత రంగంలోకి దిగింది. ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకుని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఈమె.. ఇద్దరు సీఎంలపై సెటైర్లు వేస్తూ ‘పారాసిటమాల్' పోస్ట్‌ను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Recommended Video

Corona Virus India : Upasana Konidela Comments On Corona Virus In Telangana

ముఖ్యమంత్రుల చేతిలో గోలీ పెట్టి రచ్చరచ్చ

ఇరు రాష్ట్రాల సీఎంలు గతంలో కలిసినప్పుడు దిగిన ఫొటోను మార్పింగ్ చేసి.. బొకే ప్లేస్‌లో ‘పారాసిటమాల్' గోలీ పెట్టేసింది మాధవీలత. ఈ ఫోటోను తన ఫేస్‌బుక్ లో షేర్ చేస్తూ ''ఇస్తినమ్మ వాయనం తీసుకుంటినమ్మ వాయనం'' అని కామెంట్స్ చేసింది. దీంతో ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X