థియేటర్‌ అద్దాల్ని పగులకొట్టి, ఫర్నిచర్‌ ధ్వంసం

By Srikanya

బెంగళూరు : మాణిక్య (తెలుగులో మిర్చి)సినిమా ఓపెనింగ్స్‌పై నటుడు, దర్శకుడు సుదీప్‌ సంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం మాణిక్య సినిమా విడుదలైంది. అన్ని కేంద్రాల నుంచి మంచి నివేదికలు అందుతున్నాయన్నారు. ఎంతో శ్రమకోర్చి సినిమాను రూపొందించామని అందుకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండడం సంతోషాన్ని కల్గిస్తోందన్నారు. అయితే రిలీజ్ రోజు కొన్ని చోట్ల థియోటర్స్ లో సమస్య ఎదురైంది. దాంతో థియోటర్ అద్దాలు పగలకొట్టారు.

వివరాల్లోకి వెళితే... సుదీప్ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. థియేటర్‌ అద్దాల్ని పగులకొట్టారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మండ్య లోని మహావీర్‌ థియేటర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. సుదీప్‌ హీరోగా నటించిన మాణిక్య (తెలుగులో మిర్చి) సినిమా విడుదలైంది. తొలి ప్రదర్శనన వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

Maanikya Show 'Stopped' for Technical Errors

ప్రదర్శన ఆరంభమైన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. ప్రదర్శన నిలిచిపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో రెచ్చిపోయిన అభిమానులు అద్దాల్ని పగులకొట్టారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. రాష్ట్రంలో ఇతర అనేక కేంద్రాల్లో కూడా సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X