twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆటో డ్రైవర్‌గా కనిపించబోతున్న సాయి పల్లవి

    By Bojja Kumar
    |

    'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్‌గా మారిన సాయి పల్లవి.... ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతోంది. తమిళంలో సాయి పల్లవి, ధనుష్ జంటగా తెరకెక్కుతున్న 'మారి-2'. ఈ చిత్రంలో సాయి పల్లవి పాత్ర గురించి ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆమె ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించబోతోందట.

    ఇందుకోసం ఆటో నడపటంలో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుందట. మలయాళ హిట్ చిత్రం ప్రేమమ్ తర్వాత పాపులర్ అయిన ఈ తమిళ బ్యూటీ విభిన్నమైన పాత్రలు, సెలెక్టెడ్ మూవీస్ ఎంచుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళుతోంది.

     Maari 2: Sai Pallavi playing auto driver role

    'మారి-2' చిత్రాన్ని ధనుష్ తన సొంత బేనర్ వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. మలయాళం యాక్టర్ టోవినో థామస్ మెయిన్ విలన్ పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, రోబో శంకర్, కృష్ణ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

    ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. 'మారి' గతంలో తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 'మారి-2' చిత్రాన్ని కూడా టాలీవుడ్ డబ్బింగ్ వెర్షన్ విడుదల చేస్తారని టాక్.

    ఈ సినిమాతో పాటు సాయి పల్లవి సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఎంజీకె చిత్రంలో నటిస్తోంది. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగులో శర్వానంద్ సరసన 'పడి పడి లేచే మనసు' చిత్రం చేస్తోంది.

    English summary
    Actress Sai Pallavi is currently shooting for her second Tamil outing Maari 2 with Dhanush. The latest reports suggest that Sai Pallavi will be seen playing a role of an auto driver in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X