Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆటో డ్రైవర్గా కనిపించబోతున్న సాయి పల్లవి
'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్గా మారిన సాయి పల్లవి.... ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతోంది. తమిళంలో సాయి పల్లవి, ధనుష్ జంటగా తెరకెక్కుతున్న 'మారి-2'. ఈ చిత్రంలో సాయి పల్లవి పాత్ర గురించి ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆమె ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించబోతోందట.
ఇందుకోసం ఆటో నడపటంలో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుందట. మలయాళ హిట్ చిత్రం ప్రేమమ్ తర్వాత పాపులర్ అయిన ఈ తమిళ బ్యూటీ విభిన్నమైన పాత్రలు, సెలెక్టెడ్ మూవీస్ ఎంచుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళుతోంది.
'మారి-2' చిత్రాన్ని ధనుష్ తన సొంత బేనర్ వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. మలయాళం యాక్టర్ టోవినో థామస్ మెయిన్ విలన్ పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, రోబో శంకర్, కృష్ణ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. 'మారి' గతంలో తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 'మారి-2' చిత్రాన్ని కూడా టాలీవుడ్ డబ్బింగ్ వెర్షన్ విడుదల చేస్తారని టాక్.
ఈ సినిమాతో పాటు సాయి పల్లవి సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఎంజీకె చిత్రంలో నటిస్తోంది. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగులో శర్వానంద్ సరసన 'పడి పడి లేచే మనసు' చిత్రం చేస్తోంది.