Jr NTR Fans: రక్తంతో ఎన్టీఆర్‌కి అభిషేకం.. తారక్ మీరైనా చెప్పండి అంటూ వీడియో వైరల్
హీరోలు అంటే అభిమానులకు ప్రాణం. ఎనలేని ప్రేమ. వారికోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడతారు. అయితే ఆ అభిమానం హద్దుల వరకు ఉంటే బాగుంటుది. కానీ ఒక్కోసారి వారి ప్రేమ పీక్స్ లో ఉంటుంది. దాంతో వాళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియట్లేదు. ఇటీవలే ఓ హీరో ఫ్యాన్స్ మరో అభిమానిని చంపిన సంఘటన గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రక్తంతో అభిషేకం చేసి వార్తల్లో నిలిచారు. అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
నటనలో వైవిధ్యం:ఐదారేళ్లుగా సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. సినీ ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన తారక్ తన నటనాకౌశల్యంతో కోట్లలో అభిమానులను సంపాదించుకున్నాడు. మొదటి సినిమా నుంచి నేటి RRR వరకు నటనలో వైవిధ్యం చూపిస్తూ అలరిస్తున్నాడు.

తారక్ బర్త్ డే:RRR సక్సెస్ తో గ్లోబల్ స్థాయిలో సినిమాలు చేస్తున్నాడు యంగ్ టైగర్. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాల్లో విభిన్నమైన క్యారెక్టర్లతో అలరించేందుకు రెడీగా ఉన్నాడు. వార్ 2, ప్రశాంత్ నీల్ NTR31 సినిమాలతో పాటు కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తారక్ పుట్టినరోజు సందర్భంగా దేవర టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

రక్తంతో అభిషేకం:దేవర టైటిల్ పోస్టర్ కు భారీ స్థాయిలో స్పందన రాగా.. ఈ వేడుకతోపాటు ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు అభిమానులు. అయితే దేవర టైటిల్ పోస్టర్ లో ఎన్టీఆర్ ఒళ్లంత రక్తంతో ఉన్న లుక్ హైలెట్ అయిందని తెలిసిందే. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నరా అన్నట్లుగా ఎన్టీఆర్ ఫొటోకు రక్తంతో అభిషేకం చేసి ఆశ్చర్యపరిచారు ఫ్యాన్స్.

అలా నిరసన :మచిలీపట్నంలోని కొందరు ఎన్టీఆర్ అభిమానులు ఓ గొర్రె పోతుని బలి ఇచ్చి దాని రక్తంతో తారక్ ఫొటోకు అభిషేకం చేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో తెగ గింగిరాలు తిరుగుతోంది. అయితే ఈ చర్యపై పలువురు విమర్శిస్తున్నారు. అభిమానం పేరుతో మూగ జీవాలను ఇలా హింసించడం ఎందుకు అంటూ కామెంట్స్ రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

తారక్ రియాక్షన్:అంతేకాకుండా ఇలాంటి పనులు కరెక్ట్ కాదని, మరోసాలి ఇలా చేయకుండా ఉండేలా తన అభిమానులకు తారక్ చెప్పాల్సిందిగా కోరుతూ వీడియోలు షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలకు ఎన్టీఆర్ ను ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఒక్క మాటైన మాట్లాడండి తారక్ అంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. మరి దీనిపై తారక్ ఏమైనా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











