twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా డాటర్ నిహారిక నుంచి ‘మ్యాడ్’ అనౌన్స్‌మెంట్...

    |

    Recommended Video

    Mad Announcement_by Niharika_Konidela

    మెగా డాటర్ నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్‌పిక్చర్స్ అనే బేనర్లో వెబ్ సిరీస్‌లు ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ బేనర్లో 'ముద్దపప్పు ఆవకాయ్' వెబ్ సిరీస్ వచ్చి సూపర్ హిట్ అయింది. అయితే ఇది కేవలం కొన్ని ఎపిసోడ్లు మాత్రమే ప్రసారమై నిలిచి పోవడంతో చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు.

    'ముద్దపప్పు ఆవకాయ్' తర్వాత చాలా కాలం పాటు పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ బేనర్లో ఎలాంటి వెబ్ సిరీస్‌లు రాలేదు. చాలా కాలం తర్వాత ఈ బేనర్లో 'మ్యాడ్ హౌస్' పేరుతో వెబ్ సిరీస్ రాబోతోంది. ఇది దాదాపు 100 ఎపిసోడ్లతో, సంవత్సరన్నర పాటు సాగుతుందట. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిహారిక ఓ వీడియో విడుదల చేశారు.

    ‘మ్యాడ్ హౌస్' ఎలా ఉండబోతోంది

    ‘మ్యాడ్ హౌస్' ఎలా ఉండబోతోంది

    ‘మ్యాడ్ హౌస్' వెబ్ సిరీస్ ఎలా ఉండబతోంది? అనే విషయమై నిహారిక స్పందిస్తూ.... ఇదొక సిచ్చువేషనల్ కామెడీ సిరీస్ అని తెలిపారు. ఇది ఒక నలుగురు మిలియనీర్లకు సంబంధించిన కథ. అంరినీ నవ్విస్తూ ఈ మ్యాడ్ హౌస్ వెబ్ సిరీస్ సాగుతుందన్నారు.

    ముద్దపప్పు ఆవకాయ్

    ముద్దపప్పు ఆవకాయ్

    ‘ముద్దు పప్పు ఆవకాయ్' వెబ్ సిరీస్ తీసినపుడు మేము కొన్ని ఎపిసోడ్లు మాత్రమే చేయగలిగాం. తర్వాత చాలా మంది ఫ్యాన్స్ నెక్ట్స్ ఎపిసోడ్ ఎప్పుడూ అని చాలా మంది మెసేజెస్ పెట్టారు. కానీ మ్యాడ్ హౌస్ విషయంలో అలా జరుగదు. 100 ఎపిసోడ్లతో సంవత్సరన్నర పాటు మీకు వినోదం పంచుతుంది' అని నిహారిక తెలిపారు.

    డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు

    డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు

    మీకు ఇతర ఓటీటీ ఫ్లాట్ ఫాం మాదిరిగా డబ్బులు కట్టి ఈ సిరీస్ చూడాల్సిన అవసరం లేదు. ఇది మన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ యూబ్యూబ్ ఛానల్‌లో ఎలాంటి పేమెంట్ లేకుండా ఎన్నిసార్లు అయినా చూడవచ్చు అని నిహారిక చెప్పుకొచ్చారు.

    నిర్మాణ రంగంలో నిహారిక

    పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ద్వారా ఇపుడు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్న నిహారిక ఇక్కడ సక్సెస్ అయితే భవిష్యత్తులో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

    English summary
    After a very long time, we are coming with a Series and that too with a 100 Episode SitCom for the first time in Telugu. Stay tuned for the Curtain Raiser of Mad House presented by Mapprr. Directed by Mahesh Uppala, Produced by Niharika under Pink Elephant Pictures and Co Produced by Infinitum Network Solutions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X