రెడ్ స్టార్ మాదాల రంగారావు ఆరోగ్య పరిస్థితి విషమం!
ఆరోగ్య సమస్యలతో భాదపడుతున్న రెడ్ స్టార్ మాదాల రంగారావు పరిస్థితి మరింత విషమంగా మారింది. గత కొన్ని రోజులుగా ఆయన హైదరాబాద్ లోని ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్వాసకోశ సమస్యలు తీవ్రమైనట్లు తెలుస్తోంది. వెంటిలేటర్ సాయంతో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు రంగారావు కుమారుడు తెలిపాడు.
డయాలసిస్, లైఫ్ సేవింగ్ మెషిన్ సాయంతో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కిడ్నీల పనితీరు క్షిణించడం, ఊపిరి తీసుకోలేక పోవడంవలన ఆ ప్రభావం శరీరంలోని మిగిలిన అవయవాలపై కూడా పడ్డట్లు తెలుస్తోంది. అభిమానుల ప్రార్థనలు ఆయన్ని కాపాడతాయని కుమారుడు రవి అంటున్నారు.

విప్లవాత్మక చిత్రాలకు మాదాల రంగారావు ప్రసిద్ధి. మహాప్రస్థానం, ప్రజాశక్తి, స్వరాజ్యం వంటి చిత్రాలతో రెడ్ స్టార్ గా గుర్తింపు పొందారు. మార్పు కోసమే నా చిత్రాలు.. నక్సలిజం కోసం కాదు అని రంగారావు చెప్పేవారు.


Click it and Unblock the Notifications