ఆరోపణలన్నీ అవాస్తవాలే: మాదాల రవి

By Bojja Kumar

హైదరాబాద్: ''నా పైన ఆరోపణలు అవాస్తవాలు, అసత్య ఆరోపణలు. వాటిల్లో ఎటువంటి నిజం లేదు. అన్యాయంగా నాపై కేసు పెట్టారు. దానిపై నేను కోర్టులోనే పోరాడతాను. నాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకముంది. నేను ఏ నేరం చేయలేదు. కనుక నాకు నూటికి నూరు శాతం న్యాయం దక్కుతుందని ధృడంగా నమ్ముతున్నాను. నేను ఆరోజు రాత్రే బెయిల్‌పై ఇంటికివచ్చేశాను. ఎటువంటి జైలుకి వెళ్ళలేదు. కానీ కొన్ని పత్రికలు, సోషల్‌ వెబ్‌సైట్స్‌లో దుష్ప్రచారం జరిగింది. నా 40 ఏళ్ళ ఆదర్శవంతమైన జీవితాన్ని దెబ్బతీసే విధంగా వున్నాయి. అన్యాయంగా నాపై ఆరోపణలు చేశారు. నేను నా కార్యక్రమాలలో, షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాను'' అని నటుడు నిర్మాత మాదాల రవి తనపై ఇటీవలే వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు.

ఆరోపణలు ఇవీ...

Madala Ravi Clarifies on Recent case

యువతిని వేధించిన కేసులో పోలీసులు మాదాల రవిని అరెస్టు చేసినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. రవి తనను వేధించాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో మాదాల రవిని సైబర్ క్రైమ్ పోలీసులు (సీసీఎస్) అరెస్టు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పటికే పెళ్లయిన మాదాల రవి మరో యువతితో ప్రేమాయణం సాగించాడని, ఆమెకు వేరే యువకుడితో నిశ్చితార్థం కావడంతో ఆమెను బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి. విప్లవ నటుడు, నిర్మాత మాదాల రంగారావు కుమారుడైన రవి తెలుగులో ఇలవేల్పు, బ్రోకర్ 2 చిత్రాల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X