ఓ వైపు రేప్ కేసు... సంతోషంగా అతడినే పెళ్లాడిన హీరోయిన్!

By Bojja Kumar

Recommended Video

గ్రాండ్ గా నటుడు మిథున్‌ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌ వివాహం

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌ వివాహం హీరోయిన్ మదాలసా శర్మతో సింపుల్‌గా జరిగింది. ఈ వేడుకలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పాల్గొన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి జులై 7న వీరి వివాహం ఊటీలో గ్రాండ్‌గా జరుగాల్సి ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం మహాక్షయ్ మీద రేప్ కేసు నమోదు కావడంతో నిందితుడుగా ఉన్న అతడిని విచారించేందుకు పోలీసులు పెళ్లి వేదిక వద్దకు చేరుకోవడంతో వివాహం వాయిదా పడింది. ఆ తర్వాత వెంటనే కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది.

కేసు నమోదైనప్పటికీ అతడినే సంతోషంగా పెళ్లాడిన మదాలసా శర్మ

కేసు నమోదైనప్పటికీ అతడినే సంతోషంగా పెళ్లాడిన మదాలసా శర్మ

బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు శుభాష్ శర్మ, నటి శీలా శర్మ కుమార్తె అయిన మదాలసా శర్మ కొంత కాలంగా మహాక్షయ్ చక్రవర్తితో రిలేషన్లో ఉంది. ఇరు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించింది. కేసు నమోదైన తర్వాత కూడా మదాలసా కుటుంబం పెళ్లికి ఆపక పోవడానికి కారణం తను మెచ్చిన వాడినే పెళ్లాడేందుకు మదాలసా శర్మ సంతోషంగా ఒప్పుకోవడమే అని తెలుస్తోంది.

మహాక్షయ్‌తో పాటు తల్లిపై కేసు

మహాక్షయ్‌తో పాటు తల్లిపై కేసు

మహాక్షయ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఇటీవల ఓ యువతి కంప్లయింట్ చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని, తనకు ఇష్టం లేకున్నా ఏవో మందుల ఇచ్చి అబార్షన్ అయ్యేలా చేశాడని ఆరోపించింది. మహాక్షయ్ తల్లి, మిథున్ భార్య యోగితా బాలి కూడా ఇందుకు సహకరించిందని, నువ్వు ఎప్పటికీ నా కోడలివి కాలేవని తనను బెదిరించిందని... యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.

ముందుస్తుగా బెయిల్

ముందుస్తుగా బెయిల్

యువతి కేసు నేపథ్యంలో మహాక్షయ్, యోగితా బాలి ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. బెయిల్ లభించడం వల్లనే మహాక్షయ్, యోగితా బాలి ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదని తెలుస్తోంది.

మహాక్షయ్ మీద కేసు పెట్టింది ఎవరు?

మహాక్షయ్ మీద కేసు పెట్టింది ఎవరు?

మహాక్షయ్ మీద కేసు పెట్టిన యువతి కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. హిందీతో పాటు భోజ్‌పురి చిత్రాల్లో ఆమె నటించారు. మహాక్షయ్‌తో తాను 2015 నుండి రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X