ప్రముఖ నటుడి కొడుకును పెళ్లాడబోతున్న హీరోయిన్
'ఫిట్టింగ్ మాస్టర్' సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి... ఆలస్యం అమృతం, మేం వయసుకు వచ్చాం, చిత్రం చెప్పిన కథ, రామ్ లీలా తదితర చిత్రాల్లో నటించిన ముంబై బ్యూటీ మదాలస శర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాదాలస శర్మ.... ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తిని పెళ్లడబోతోందట. జులై 7న పెళ్లి ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం. విదేశాల్లో వీరి వివాహం జరుగుతుందని టాక్.

కొన్ని రోజులుగా మదాలస శర్మ, మిమో చక్రవర్తి ప్రేమించుకుంటున్నారు. ఎట్టకేలకు వీరి వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. వెడ్డింగ్ వెన్యూ ఎక్కడ అనే దానిపై త్వరలో క్లారిటీ రానుంది.
బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు శుభాష్ శర్మ, నటి శీలా శర్మ కుమార్తె అయిన మదాలసా శర్మ 17 ఏళ్ల వయసులోనే నటిగా కెరీర్ ప్రారంభించింది. అయితే అనుకున్న స్థాయిలో ఆమె కెరీర్ సాగలేదనే చెప్పాలి. తెలుగులో చిత్రం చెప్పిన కథ తర్వాత ఆమె సినిమాలు రాలేదు. తెలుగు, కన్నడ, తమిళం, పంజాబి భాషల్లో ప్రయత్నించినా పెద్దగా వర్కౌట్ కాలేదు.


Click it and Unblock the Notifications











