ప్రవరాఖ్యుడు ఎలా ఉంటాడంటే...దర్శకుడు మదన్‌

By Srikanya

జగపతి బాబు, ప్రియమణి కాంబినేషన్లో దర్శకుడు మదన్ ప్రవరాఖ్యుడు అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో రిలీజ్ కానున్న ఈ చిత్రం గురించి మదన్ మీడియాతో మాట్లాడుతూ...ప్రకృతి సహజంగా ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో.. ప్రేమ కూడా సహజంగా ఉంటే అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ ప్రేమను అతిశయోక్తిగా చూపించడం, పోల్చి చూడటం వల్ల ప్రేమ తన సహజత్వాన్ని కోల్పోతూ ఉంటుంది. కానీ, మా 'ప్రవరాఖ్యుడు' సహజంగా ఉండే ప్రేమకథతో రూపొందించిన చిత్రం. నేను నేనుగా ఉండాలనుకునే వ్యక్తి మా 'ప్రవరాఖ్యుడు'. ప్రతి ఒక్కరికీ తమకే ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. మానవ సంబంధాలలో ఒక వ్యక్తిని ఆ వ్యక్తిలాగే చూస్తే ఎలాంటి సమస్యా ఉండదు. ఆ వ్యక్తిని మరొక వ్యక్తితో పోల్చి చూస్తేనే ఆ సంబంధాల పట్టు సడలుతూ ఉంటుంది. మనుషుల మధ్య బెటర్‌ రిలేషన్స్‌ ఉంటే బెటర్‌ సొసైటీ ఏర్పడుతుంది. మానవ సంబంధాల మధ్య పోల్చిచూడటం ఉండకూడదన్న విషయాన్ని అందర్నీ ఆకట్టుకునే, అలరించే పద్ధతిలో చెప్పిన చిత్రమే మా 'ప్రవరాఖ్యుడు' అన్నారు. ఇక ప్రియమణి,మదన్,జగపతిబాబు కాంబినేషన్లో గతంలో పెళ్ళయిన కొత్తలో అనే చిత్రం వచ్చి మంచి విజయం సాధించింది. దాంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X