'మదనుడు'...మృగమైతే రసవత్తరంగా...
"గతంలో 'మన్మథులు' అనే అనువాద చిత్రాన్ని విడుదల చేసి విజయం సాధించిన నిర్మాత వి. సురేశ్ చౌదరి తాజాగా 'ఇలకణ ఒరుపిళ్లై' అనే తమిళ చిత్రాన్ని 'మదనుడు' (మృగమైతే) పేరుతో అనువదించి రిలీజ్ చేసారు.రెండువారాల క్రింతం రిలీజ్ అయిన ఆ చిత్రం మంచి విజయం సాధించింది అని ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిర్మాత తెలిపారు. ఆయన మాటల్లోనే...'మదనుడు'(మృగమైతే) చిత్రాన్ని అనువదించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. ఒక వారం పూర్తయి, రెండో వారంలోనూ చక్కని కలెక్షన్లని మా సినిమా వసూలు చేస్తోంది. విశేషమేమంటే తమిళ ఒరిజినల్ వెర్షన్ మే 7న విడుదల కాబోతోంది. అంటే మాతృక కంటే మూడు వారాలు ముందుగానే తెలుగు అనువాద చిత్రాన్ని విడుదల చేసి, విజయాన్ని సాధించాం అన్నారు. అలాగే ఈ చిత్రం విజయానికి కారణం ప్రేమ, స్నేహ, సహజీవనం అనే అంశాల మేళవింపుతో ఆద్యంతం రసవత్తరంగా రూపొందటమేనన్నారు. అలాగే ఈ సినిమాలో చక్కని సందేశం కూడా ఉంది అని కూడా ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications











