ప్రేమకోసం మడత (మడతకాజా ప్రివ్యూ)
అల్లరి నరేష్ తాజా చిత్రం మడతకాజా ఈ రోజు విడుదవుతోంది.స్నేహా ఉల్లాల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో నరేష్ ...తెలివితేటలు నిండుగా ఉన్నవాడిలా కనిపిస్తాడు. అతని పేరు కళ్యాణ్. కళ్యాణ్ కి కండబలం లేదు,గుండె బలం లేదు. ఉన్నదంతా బుద్ది బలమే. మాటలలో మడతపెట్టేస్తూంటాడు. చివరకు తను ఒక అమ్మాయిని ప్రేమిస్తే..ఆ అమ్మాయే వచ్చి ఐలవ్ యు చెప్పాలని పట్టుబట్టే రకం. అలాగే చెప్పించుకుంటాడు కూడా. ఆ అమ్మాయిని కూడా మడతెట్టేశాక అస్సలు మడత మొదలవుతుంది. అప్పుడు కళ్యణ్, హీరోయిన్ కలిసి ఎంతమందిని బురిడి కొట్టించారు..అదెలాగ అన్నదే ఈ చిత్రం కథాంశం. నవరసాలతో కూడిన ఈ కాజా రుచులు భలే గమ్మత్తుగా ఉంటాయనీ అల్లరి నరేష్ చెప్తున్నారు. అలాగే ప్రతీ సన్నివేశం పక్కా టైమింగ్ తో సాగుతుంది. దర్శకుడు సీతారామరాజు చిత్రాన్ని మలిచిన తీరు చాలా బాగుంది. నా కెరీర్ లో వైవిధ్యమైవ చిత్రంగా మిగులుతుంది అంటున్నారు."ఆహుతి ప్రసాద్‌గారు ఈ చిత్రంలో కోస్తా మాండలికంలో కాదు. నైజామ్‌లో మాట్లాడతారు. అలాగే నాకు ఒకటే నాయిక. జయప్రకాష్‌రెడ్డికి 40 మంది నాయికలుంటారు. సీతారామరాజు 'బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్' సమయంలో నా దగ్గరికొచ్చి సినిమా చేస్తానన్నారు. ఈ కథ చెప్పారు. నచ్చి వెంటనే చేశాను.ఎవరినీ నొప్పించకుండా పని చేయించుకోవడంలో ఆయన దిట్ట. నా సినిమాల్లో లాజిక్‌లు కాస్త మిస్సవుతుంటాయి. కామెడీ సినిమాల్లో తప్పదు. సీతారామరాజుతో మార్చి నుంచి మరో సినిమా చేస్తాను. మా నిర్మాత ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తుంటారు. ఆయనలాంటి వారు తప్పకుండా చేయాల్సిన సినిమా 'మడతకాజా'. చాలా చక్కగా కుదిరింది.''
నటీనటులు: అల్లరి నరేష్, స్నేహా ఉల్లాల్, సుబ్బరాజు, జయప్రకాశ్, ఆహుతి ప్రసాద్, ఆశిశ్ విద్యార్థి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చలపతిరావు తదితరులు.
మాటలు: వేగేశ్న సతీశ్
పాటలు: సీతారామశాస్త్రి, భాస్కరభట్ల, సురేంద్రకృష్ణ
సంగీతం: శ్రీవసంత్
ఛాయాగ్రహణం: అడుసుమిల్లి విజయ్‌కుమార్
కూర్పు: మార్తాండ్ కె. వెంకటేశ్
కళ: బాబ్జీ
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేకానంద కూచిభొట్ల
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సీతారామరాజు దంతులూరి.
నిర్మాత: వేదంరాజు టింబర్


Click it and Unblock the Notifications











