twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీ అమ్మ, అక్కల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఇంటికొచ్చేస్తారు. చీర కడితే సీతాదేవి అయిపోతారా: మాధవీలత

    |

    హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన మాధవీలత ఆ తరువాత మెల్లగా రాజకీయాలవైపు అడుగులు వేసిన విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ గా ఉన్నంత వరకు పెద్దగా హడావుడి చేయని ఆమె ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి వచ్చిందో అప్పటి నుంచి ఊహించని రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు. మాటకు మాటకు దెబ్బకు దెబ్బ అన్నట్లుగా మాధవీలత నడుచుకుంటున్న విధానం మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది.

    బూతులు మాట్లాడినా కూడా

    బూతులు మాట్లాడినా కూడా

    మాధవీలత భారత జనతా పార్టీలో కీలకనేతగా గుర్తింపు అందుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యర్ధులు ఎలాంటి కామెంట్స్ చేసినా కూడా ఉహీంచని విధంగా కౌంటర్లు వేస్తున్నారు. బూతులు మాట్లాడినా కూడా ఆమె అదే రేంజ్ లో ఆన్సర్ వస్తుందని కూడా కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

    చెత్త కామెంట్స్ కు రియాక్ట్ అవ్వకూడదని అనుకుంటున్నా

    చెత్త కామెంట్స్ కు రియాక్ట్ అవ్వకూడదని అనుకుంటున్నా

    ఇటీవల ఫేస్ బుక్ లైవ్ లో ఫాలోవర్స్ తో ముచ్చటించిన మాధవీలత ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. కొత్త ఏడాదిలో చెత్త కామెంట్స్ కు రియాక్ట్ అవ్వకూడదని అనుకుంటున్నా. ఒకవేళ మీ కామెంట్స్ కు గట్టి కౌంటర్ వస్తే అది నేను ఇచ్చినది కాదు. నా పేజ్ ను మ్యానేజ్ చేసేవాళ్ళు పెడతారు.

    సైకోలకు సైకోలాగానే ఉండాలి

    సైకోలకు సైకోలాగానే ఉండాలి

    మీ లాంటి శాడిస్ట్ లకు సమాధానం ఇవ్వడానికే స్పెషల్ టీమ్ ను పెట్టుకున్నాను. సైకోలకు సైకోలాగానే ఉండాలి. రిప్లై ఇస్తుంది కదా అని గింజ, బింజా అని తిడితే ఊరుకునేది లేదు. నన్ను ఎంత తిడితే వాళ్ళు కూడా మిమ్మల్ని అలానే తిడతారు. మాటకు మాట సమాధానం ఉంటుంది.

    ఇంటికి కూడా వచ్చేస్తారు జాగ్రత్త

    ఇంటికి కూడా వచ్చేస్తారు జాగ్రత్త

    నన్ను ఎలా తిడితే మా వాళ్ళు కూడా అదే రేంజ్ లో తిడతారు. ఇంటికి కూడా వచ్చేస్తారు జాగ్రత్త. మీ అమ్మ, అక్కలను జాగ్రత్తగా చూసుకోండి. భూమి మీద ఎవరు కూడా మంచి వాళ్ళు కాదు. మీరు మంచిగా ఉంటే మంచిగా ఉంటా. తేడా వస్తే నేను కూడా మంచిదాన్ని కాదు అంటూ మాధవీలత సీరియస్ గా హెచ్చరిక జారీ చేసింది.

    చీర కట్టినంత మాత్రానా సీతాదేవిలు అయిపోరు

    చీర కట్టినంత మాత్రానా సీతాదేవిలు అయిపోరు

    ఇక మతాల సంస్కృతుల మీద కామెంట్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని చెబుతూ ఎదుటివాళ్ళ చీరల మీద కామెంట్ చేయడం కూడా తగదని అన్నారు. చీరలు కడితే నడుము ఎక్కడ కనిపిస్తుందా అని చూసే రకం మీరు. అయినా చీర కట్టినంత మాత్రానా సీతాదేవిలు అయిపోరు. అలాగే టీ షర్ట్ వేసిన వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అని కాదు.. అంటూ మాధవీలత తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.

    English summary
    It is known that Madhaveelatha, who was introduced to the silver screen as a heroine, then slowly stepped towards politics. But she has not been in a big rush as long as she has been a heroine and has been giving counters in an unexpected range ever since she got into politics. Madhavilata's behavior has become a hot topic in the media as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X