'రక్త చరిత్ర -2' లో తన పాత్రను తెరపై చూసుకున్న మద్దెలచెరవు సూరి
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం రక్త చరిత్ర-2 లో మద్దెల చెరువు సూరి పాత్ర కీలకమైందనే సంగతి తెలిసిందే. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఆ పాత్రకు ఇప్పటిక్ క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం ఈరోజు (డిసెంబర్ 3, శుక్రవారం) విడుదల అవుతున్న నేపథ్యంలో మద్దెలచెరువు సూరి ఆ చిత్రం ప్రివ్యూ షోని గురువారం తిలకించారు. బెంగళూరు నగరంలోని మంత్రిమాల్ లో రాత్రి 10 గంటలకు ప్రదర్శించిన షోను ఆయనతోపాటు భార్య భానుమతి కూడా చూశారు. ఈ షో చూసేందుకు సూరి అనుచరులు దాదాపు యాభై వాహనాల్లో అనంతపురం జిల్లా నుంచి తరలివచ్చారు.
పగ చల్లారడానికి ప్రతీకారమే విరుగుడు అని నమ్మిన విపరీత మనుషుల కథ అంటూ ఈ చిత్రం గురించి రామ్ గోపాల్ వర్మ చెప్తున్నారు. ఈ సెకెండ్ పార్ట్ లో ప్రతాప్ రవి(వివేక్ ఒబరాయ్) రాజకీయ ఎదుగుతూంటాడు. అయితే అతన్ని సూర్యనారాయణ (సూర్య) చంపాలని నిర్ణయించుకుంటాడు. అందుకు అతనికి బలమైన కారణాలు ఉంటాయి. రవిని చంపేందుకు ప్రాన్స్ రెడీ చేసుకుంటాడు. జైల్లోనే ఉంటూ ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు పన్నాగాలు పన్నుతూంటాడు. అందుకు అతని భార్య భవానీ (ప్రియమణి) ఎలా సహకరించిందన్నది..అతను పగ తీర్చుకున్నాడా...రవి ఏమయ్యాడు...అన్న విషయాలుతో ఈ చిత్రం ఆసక్తిగా నడుస్తుంది.


Click it and Unblock the Notifications











