బూతులే తక్కువ: రామ్‌గోపాల్ వర్మని ఏకి పడేసిన దర్శకుడు మద్దినేని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులను విమర్శించిన వాళ్లను బూతులు తిడుతూ దర్శకుడు మద్దినేని రమేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులను విమర్శించిన వాళ్లను బూతులు తిడుతూ దర్శకుడు మద్దినేని రమేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టులు పెడుతూ, రాంగోపాల్ వర్మపై మండిపడ్డాడు. రాంగోపాల్ చేసిన ఆరోపణలను తప్పుపడుతూ, కుటుంబ సభ్యులతో చీకొట్టించుకున్నాడని, అయినా బుద్ధి తెచ్చుకోలేదని విమర్శించాడు.
Recommended Video


బక్కగాల్లకీ బలుసుగాల్లాకీ బలుపుగాల్లకీ బఫూన్గాల్లకీ
సెక్యూరిటీ లేకుండా బయట తిరగలేని బతుకు బతుకుతున్నాడని నిప్పులు చెరిగాడు.బక్కగాల్లకీ బలుసుగాల్లాకీ బలుపుగాల్లకీ బఫూన్గాల్లకీ అంటూ నంది అవార్డుల విధానాన్ని విమర్శించిన బన్నీ వాసు, నల్లమలపు బుజ్జి, బండ్ల గణేశ్ తదితరులనూ వదల్లేదు. బక్కగాళ్లు, బలుపుగాళ్లు, బఫూన్లకు బయపడేది లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మాఫీయాకి జడిసి
నంది అవార్డ్స్ కమిటీలకు అవార్డ్స్ ఇవ్వాలన్న దర్శకుడా... తెలుగులో సినిమా తీయనని పారిపోయి ముంబై వెళ్ళి అక్కడ మాఫీయాకి జడిసి మళ్లీ తెలుగులో సినిమా తీసిన నువ్వా మాట్లాడేది ... నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నువ్వు నంది తీసుకున్నప్పుడు నీకు అప్పటి కమిటీ మీద ఇలాంటి ఫీలింగ్ కలగలేదా?

తెలుగుజాతి ఖర్మ
ఈ సమాజం మీద నాకు భాద్యత లేదని కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదని ప్రకటించిననీకు నంది అవార్డ్స్ మీ మాత్రం భాద్యత గౌరవం వచ్చాయా.. తెలుగుజాతి ఖర్మ ... నిజాయితీగా పనిచేసిన మా 2016కమిటీ గురించి మాట్లాడితే ఒప్పుకోం...దేశంలో ఇన్నిరకాల జడ్యాలు పెడదోరనులు వ్యత్యాసాలు అంటరానితరాలు వుంటేకనపడవు.

నిర్మాతల సొమ్ముతింటూ
కోట్లకు కోట్లు నిర్మాతల సొమ్ముతింటూ వాళ్లను కనీసం మనుషులుగా గుర్తించని కుటుంబాలకు వీడొక భానిస బఫూన్. ప్రయివేట్ సెక్యూరిటీ లేకపోతే బయటకు వెళ్లలేని బతుకు నీది ఇంకోసారి నంది కమిటీల గురించి మాట్లాడితే ఖబద్దార్ బక్కగాల్లకీ బలుసుగాల్లాకీ బలుపుగాల్లకీ బఫూన్గాల్లకీ ఇక్కడెవడూ బయపడెవారు లేరు ... ఖబడ్దార్.. మీ తోక ఊపుల్లు పిల్లల దగ్గర చూపండి పులుల దగ్గర కాదు.


Click it and Unblock the Notifications











