డ్రగ్ కేసులో క్రిష్.. మాదాపూర్ డీసీపీ కీలక కామెంట్స్!
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మొత్తం తొమ్మిది మంది పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితులుగా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు టాప్ డైరెక్టర్ క్రిష్ కూడా ఈ కేసులో 8వ నిందితుడిగా ఉన్నారని అంతా చెబుతున్నారు. అయితే దీనిపై మాదాపూర్ డీసీసీ వినీత్ క్లారిటీ ఇచ్చారు. కేసులో ఎవరెవరు ఉన్నారు, ఏం చేయబోతున్నారో చెప్పబోతున్నారు.
డ్రగ్ పెడలర్ అబ్బాస్ నీ అదుపులోకి తీసుకున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ముఖ్యంగా వివేకానందకు.. అబ్బాస్ 10 సార్లు కొకైన్ డెలివరీ చేశాడని చెప్పుకొచ్చారు. అలాగే లిషి గణేష్ కల్లపు, శ్వేత, సందీప్ లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. చరణ్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడని వివరించారు. అలాగే డైరెక్టర్ క్రిష్ కూడా ఆ పార్టీలో పాల్గొన్నారని డీసీపీ వినీత్ తెలిపారు. అయితే ఈ కేసు గురించి ఆయనను విచారణకు పిలవగా వస్తానని చెప్పినట్లు తెలిపారు.

అలాగే వివేకానంద, కేదార్, నిర్భయ్ లు కొకైన్ సేవించినట్లు తెలిసిందని డీసీపీ వినీత్ వెల్లడించారు. అయితే మిగిలిన వాళ్లు సేవించారా లేదా అనేది తెలుసుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు. క్రిష్ తో పాటు పరారీలో ఉన్న లిషి గణేష్ కల్లపు, శ్వేత, సందీప్ లకు రక్త, మూత్ర పరీక్షలు చేసి.. వాళ్లు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది నిర్ధారిస్తామని అన్నారు. అలాగే అబ్బాస్ మంజీర గ్రూపులో గతంలో పని చేశాడని క్లారిటీ ఇచ్చారు. వివేకానంద ఆర్డర్ మేరకు అబ్బాస్ సప్లయ్ చేశాడని స్పష్టం చేశారు.
అయితే ఇప్పుడే ఈ రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామని డీపీసీ వినీత్ చెప్పారు. అలాగే రిమాండ్ రిపోర్ట్ లో అన్ని విషయాలు వెల్లడిస్తామని వివరించారు. ఈ విచారణ జరిగి.. ముఖ్యంగా రక్త, మూత్ర పరీక్షల ఫలితాలు వచ్చే వరకూ.. డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది తెలిసేలా లేదు. చూడాలి మరి ముందు ముందు ఏం జరగనుంది అనేది. ఇద్దరి అమ్మాయిలు సహా మొత్తం 9 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.


Click it and Unblock the Notifications











