టీవీలో వచ్చేది నిజమైతే!?

ఈ చిత్ర కథ ఇలా మొదలవుతుంది. మనోహర్ (మాధవన్)ఓ మిడిల్ క్లాస్ మనిషి. రెంట్ సమస్యగా మారటంతో ఫ్యామిలీతో కలిసి ఓ కొత్త అపార్ట్ మెంట్ కి షిప్ట్ అవుతాడు.ఆ అపార్ట్ మెంట్ లో అతని ఫ్లాట్ నెంబర్ 13 B. పదమూడవ అంతస్తులో ఉండే ఈ ఫ్లాట్ ఆ ఫ్యామిలీకి బాగా నచ్చుతుంది. ఇల్లంతా సర్ధుకుని టీవీ ముందు కూర్చుంటారు. అందులో వస్తున్న ఫ్యామిలీ షో అచ్చం తమ ఫ్యామిలీలాగానే ఉంటుంది.
షో ముందుకు వెళ్తుంటే..మనోహర్ కుటుంబంలోనూ తెరపై జరిగేవే రిసెంబల్ అవుతూంటాయి. అది చూసి మొదట యధాలాపం అనుకుంటారు. కానీ టైమ్ గడుస్తూంటుంటే...కరెక్టుగా ఆ పోగ్రాంలో జరిగే విచిత్రమైన వన్నీ తమకూ కరెక్టుగా జరుగుతూంటాయి. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతుంది...టీవీకి ఆ ఫ్యామిలీకి ఉన్న సంభంధం ఏమిటన్నది తెరపై చూస్తేనే అందమంటున్నారు.


Click it and Unblock the Notifications











