మాధనవ్, ఆర్య..‘భలే తమ్ముడు’
మాధవన్, ఆర్య, సమీరారెడ్డి, అమల పాల్ ప్రధాన పాత్రల్లో తమిళంలో రూపొందిన 'వెట్టై' తెలుగులో 'భలే తమ్ముడు'గా అనువదించనున్నారు. ఈ చిత్రం ఇటీవల తమిళంలో విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో మాధవన్-ఆర్యలకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇక్కడ కూడా మంచి ఫలితాలను సాధిస్తుందని ఆశిస్తున్నారు. ఈ చిత్రం యొక్క తెలుగు హక్కులు దక్కించుకోవడానికి పలువురు తెలుగు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. గతంలో వచ్చిన 'రన్', 'పందెం కోడి', 'ఆవారా' చిత్రాలకు దర్శకత్వం వహించిన లింగు స్వామి ఈ చిత్రానికి దర్శకుడు.
మాధవన్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆర్య మాధవన్ తమ్ముడి పాత్రలో నటించాడు. సమీరారెడ్డి, అమలపాల్ అక్క చెల్లుల్లుగా కనిపిస్తారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం మంచి అసెట్ గా నిలిచింది. యుటివి సంస్థ తరుపున జి.ధనుంజయన్, ఎస్.పి.శివప్రసాద్ 'భలే తమ్ముడు' చిత్రాన్ని సమ్మర్లో తెలుగులో విడుదల చేయనున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











