బరువు తగ్గటానికే హీరో ఫారిన్ టూర్

By Staff

Madhavan
బరువు తగ్గటం,సిక్స్ పాక్ లు పెంచటం ఇప్పుడు అన్ని భాషా చిత్రాల హీరోలకు కామన్ అయిపోయింది. తాజాగా తమిళ హీరోగానే కాక బాలీవుడ్ స్టార్ గాను కావటానికి పావులు కదుపుతున్న సఖి ఫేమ్ మాధవన్ లండన్ వెళ్ళారు. హఠాత్తుగా షూటింగ్ లన్ని ప్రక్కన పెట్టి ఎందుకు మాయమయ్యాడు అంటే తాను బరువు తగ్గటానికే అని స్వయంగా ప్రకటించాడు. రాజ్ కుమార్ హిర్వాణి తాజా చిత్రం త్రి ఇడియట్స్ లో నటించటానికి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఆ చిత్రంలో శ్రుతి హాసన్ నటిస్తోంది.ఆమె ప్రక్కన సరైన జోడీగా కనిపించటానికే ఈ ప్రయత్నాలు అని చెప్తున్నారు.

ముంబయిలోనే మకాం పెట్టిన ఆయన అక్కడ కొన్ని క్లినిక్స్ ని సంప్రదిస్తే..అంత తక్కువ కాలంలో బరువు సరైన పధ్ధతిలో శస్త్ర చికిత్స లేకుండా కష్టమని తేల్చేసారు. దాంతో లండన్ వెళ్ళాడు. ఇక అక్కడ అతని సోదరి హెల్త్ క్లినిక్స్ నడుపుతోంది. Indian Institute of Technology స్టూడెంట్ లా కనపడాలని ఆమెకు చెపితే వెంటనే బయిలు దేరి రమ్మని చెప్పింది.

ఇది గమనించిన హిర్వాణి మిగతా ఇద్దరు హీరోలయిన అమీర్ ఖాన్,షర్మాన్ జోషి లను కూడా అదే పని మీద ఉండమని పురమాయించాడు. దానికి అమీర్ తను పెంచిన బాడీ చూపితే...ఇదేమీ బాడీ బిల్డింగ్ మీద ఆధారపడిన సినిమాకాదు.కాలేజీ కుర్రాళ్ళు అంత బాడీతో ఉండరు. తగ్గించమని చెప్పారుట. అలాగే అమితాబ్ ఈ సినిమాలో ఓ మేజర్ రోల్ వేస్తున్నారు. ఆయనికి మాత్రం ఏ కండీషన్స్ పెట్టకుండానే షూటింగ్ కి అనుమతిస్తానన్నాడు దర్శకుడు. అదీ లండన్ బరువు తగ్గే కథ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X