40ఏళ్ల తర్వాతే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు.. 'బ్రీత్'కి ఆ భయం లేదు: మాధవన్
మాధవన్.. కెరీర్ ఆరంభంలో టీవి సీరియళ్లలో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. వెండితెరకు ప్రమోట్ అయ్యాక 'సఖి', 'చెలి' వంటి సినిమాలతో లవర్ బాయ్‌గా మారిపోయాడు. మాధవన్ స్మైల్ అంటే ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు పడి చస్తారు. యాభై ఏళ్లకు దగ్గరవుతున్నా.. ఆయన ఫిజిక్, అందం మరింత పెరిగిందే తప్పితే తగ్గలేదు. ప్రస్తుతం 'బ్రీత్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్న మాధవన్.. సినిమాలు, వ్యక్తిగతంపై పలు ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు..

ఇప్పుడే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు:
నా వయసు ఇప్పుడు 48 ఏళ్లు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది హీరోలు నలభైల్లోకి వచ్చాకే సూపర్‌స్టార్లు అయ్యారు. 40ఏళ్ల తర్వాత మంచి పాత్రలు వస్తుంటాయి. అయితే అప్పటిదాకా ఎలాంటి పాత్రలు చేశాం? మున్ముందు ఎలాంటి పాత్రలు ఎంచుకుంటాం అన్నది మన మీదే ఆధారపడి ఉంటుంది. నా విషయంలో అయితే 40ఏళ్ల తర్వాతే అమ్మాయిలు నన్ను బాగా ఇష్టపడటం మొదలుపెట్టారు.

'బ్రీత్' గురించి:
ఇప్పటివరకు కమర్షియల్ సినిమాల్లో చేస్తూ వచ్చా.. మొదటిసారి ‘బ్రీత్' అనే వెబ్ సిరీస్‌లో కనిపించబోతున్నా. ఈరోజుల్లో చాలా వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి.. అలాంటప్పుడు నేను చేయబోయే దానిలో ఏం ప్రత్యేకత ఉంటుంది?.. అందుకే నో చెప్పేద్దామా అనిపించింది. పైగా ఇలాంటి టైమ్ లో నేను వెబ్ సిరీస్ లో నటించడం సరైందేనా? అన్న అనుమానం కూడా కలిగింది. కానీ 'బ్రీత్' కాన్సెప్ట్ నచ్చింది. అందుకే చేస్తున్నా..
Recommended Video


'బ్రీత్'కి ఆ భయం లేదు..:
శుక్రవారం అంటే నటీనటుల్లో ఏదో తెలియని భయం. ఎక్కువగా సినిమాలు ఆరోజే విడుదలవుతుంటాయి కాబట్టి సినిమా బాగుందా? లేదా? అన్న టెన్షన్ వెంటాడుతుంది. కానీ వెబ్‌సిరీస్‌లకు అలాంటి భయం ఉండదు. ఒక్కరోజులో తేల్చేసే కంటెంట్ ఇందులో ఉండదు.

నిర్మాతగా మారబోతున్నారా?:
చాలామంది అడుగుతున్నారు.. మీరు నిర్మాతగా మారబోతున్నారా? అని. నాకు నిర్మాతగా ఉండటం నచ్చదు. అయితే మనం చేసే ప్రాజెక్ట్ ఆసక్తికరమైందని తెలిసినప్పుడు మనం కూడా కొంత పెట్టుబడి పెడితే బాగుంటుందనిపిస్తుంది. త్వరలో ఓ శాస్త్రవేత్త జీవితం ఆధారంగా ఒక బయోపిక్‌లో నటిస్తున్నా. దానికి నిర్మాతగా వ్యవహరిస్తాను.

డబ్బు గురించి:
దేవుడి దయ వల్ల కావాల్సినంత సంపాదించాను. డబ్బు సంపాదించడం పెద్ద సమస్య కాదు. అవసరానికి మించి సంపాదించాలనే ఆశ కూడా లేదు. ఇప్పటికీ నేను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే భద్రతా సిబ్బందిని వెంటబెట్టుకుని వెళ్లను. ఆ అవసరం లేదనుకుంటా. నన్నెవరూ చంపే ప్రయత్నం చేయరు. 20ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా సాధారణ జీవితమే గడిపాను. గ్లామర్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కూడా లేదు.


Click it and Unblock the Notifications











