సదా ప్రేమలో పడిందా???
సదా లవ్ లో పడిందా..పడిందనే చెబుతున్నాయ్ తమిళ పత్రికలు. ఆమె మాత్రం అలాంటిదేమీ లేదంటోంది. సదాకు అవకాశాలు ఇప్పించడంకోసం ఆయన మాత్రం నానా పాట్లు పడుతుండడంతో వీరి మధ్య ఏదో లేకపోతే ఎందుకు ఇలా ఆమెకోసం ఆయన పాట్లు పడతారు అంటున్నారు కొడంబాకం జనాలు. ఆయన పెళ్లైన మాధవన్.
ఈ విషయంపై సదా మాట్లాడుతూ...మాధవన్ తో రెండు సినిమాలలో హీరోయిన్ గా చేశాను..అవేం పైరవీ చేయగా వచ్చినవి కావు...సహజంగా వచ్చిన అవకాశాలే...నేను ఎక్కువగా నా పాత్ర గురించే పట్టించుకుంటాను కానీ హీరో పాత్ర గురించి పట్టించుకోను..మాధవన్ పెళ్లైన మనిషి...ఇలా పుకార్లు పుట్టిస్తే ఆయన కుటుంబం ఏంకాను...మా కుటుంబం ఏం అనుకుంటుంది..నిజానికి మాధవన్ జంటిల్ మ్యాన్..ఆయనలాంటి వ్యక్తి మరొకరు దొరకరు...ఆయనతో నటించడం చాలా ఆనందదాయకమైన అంశం...ఆయనతో నటించే అవకాశం మళ్లీ లభిస్తే సంతోషంగా నటిస్తాను...అంటూ కోపంగా అంటోంది.


Click it and Unblock the Notifications











