మాధవన్, భావన జంటగా...
మాధవన్, భావన హీరో హీరోయిన్లుగా పిరమిడ్ సాయిమీరా గ్రూప్ తమిళంలో నిర్మించిన 'వాల్త్‌ఖల్' చిత్రం తెలుగులోకి అనువాదమవుతోంది. దీనికి సీమాన్ దర్శకత్వం వహించారు. కల్పనా క్రియేషన్స్, మ్యూజిక్ అండ్ లాజిక్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై యస్.వి.మహేశ్వరరెడ్డి, భారతీగణేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెలాఖరుకు ఈ చిత్రం టైటిల్ ప్రకటిస్తామని నిర్మాతలు చెప్పారు. ప్రేమ, కుటుంబం మధ్యలో ఏది గొప్పదన్న అంశాన్ని ఇందులో చర్చించడం జరిగిందని వారు తెలిపారు. లవ్, ఫ్యామిలీ అంశాలతో పాటు చక్కటి సెంటిమెంటు ఇందులో ఉందన్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రంలో ఓ చక్కటి హాస్యపాత్రను పోషించారని చెప్పారు. గతంలో వచ్చిన బొమ్మరిల్లు తరహాలో ఫ్యామిలీ సెంటిమెంటుకు మంచి ప్రాధాన్యం ఇచ్చిన చిత్రమిదని తెలిపారు. యువన్ శంకర్ రాజా సంగీతం వీనులవిందుగా ఉంటుందని, వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం : యువన్ శంకర్ రాజా, సమర్పణ : బేబీ అక్షయశ్రీ, నిర్మాతలు : యస్.వి.మహేశ్వరరెడ్డి, భారతీగణేష్, దర్శకత్వం : సీమాన్


Click it and Unblock the Notifications











