మాధవన్ ప్రియసఖి సదా
మాధవన్, సదా జంటగా కె.యస్. అదయమాన్ దర్శకత్వంలో రూపొందిన ప్రియసఖి తమిళ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల కానుంది. తేజ సినిమా పతాకంపై సి.కళ్యాణ్ తెలుగులోకి అనువదించిన ఈ చిత్రం ఈనెల 14వ తేదీన రాష్ట్రంలో విడుదల అవుతోంది. తమిళంలో ప్రియసఖి విజయం సాధించింది. లవ్ రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్.. అన్నీ సమపాళ్లలో మేళవించిన వినోదభరిత చిత్రం ఇది. అందుకే ఈ చిత్రం అన్ని వర్గాల వారినీ, వయసుల వారినీ ఆకట్టుకుంటుందని నమ్మకం ఉంది అని ఈ చిత్ర నిర్మాత సి. కల్యాణ్ అంటున్నారు. సీత, ఐశ్వర్య, రాజ్యలక్ష్మి, రేఖ, కోవై సరళ, ప్రతాప్ పోతన్, రమేశ్‌రాజా మిగతా ప్రధాన తారాగణం.
ప్రియసఖిలో మొత్తం ఐదు పాటలున్నాయి. వాటిలో రెండు దుబాయ్, ఆస్ట్రియా, లండన్ లొకేషన్లలో చిత్రీకరించారు. మిగతా పాటలు కూడా అలరిస్తాయి అని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో విడుదలైంది. రమణీ భరద్వాజ సంగీతం అందించారు.
దర్శకుడు అదయమాన్ గురించి నిర్మాత చెబుతూ.. గతంలో అదయమాన్ దర్శకత్వంలోనే తాను రాజశేఖర్ హీరోగా బొబ్బిలివంశం చిత్రాన్ని రూపొందించానని, ఆ చిత్రం విజయం సాధించిందని అన్నారు. ఈ చిత్రం కూడా ప్రేక్షకుల మెప్పు పొంది విజయపథంలో నడుస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
తెలుగులో మాధవన్ చిత్రం విడుదలై చాలా కాలం అయిందని, ఆయన అభిమానులను ఈ చిత్రం కనువిందు చేస్తుందని కల్యాణ్ అన్నారు.


Click it and Unblock the Notifications