బిగ్ బాస్‌పై మాధవీలత సంచలనం.. ఆఫర్ ఆశ చూపి వాడుకోవాలని, ఫోన్ చేసి అడిగేశాడు!

Recommended Video

Madhavi Latha Shocking Comments On Bigg Boss 2

తెలుగు చిత్ర పరిశ్రమలో రోజుకో కొత్త వ్యవహారం బయటపడుతోంది. కాస్టింగ్ కౌచ్ పై తొలిసారి గళం విప్పిన మాధవీలత, బిగ్ బాస్ గురించి కూడా సంచలన విషయాలు వెల్లడించింది. కాస్టింగ్ కౌచ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంపికలో కూడా జరిగిందని మాధవీలత ఆరోపిస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ సంజన ఆ షో గురించి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తోంది. తాను బిగ్ బాస్ విషయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని మాధవీలత బయట పెట్టింది. మాధవీలత వ్యాఖ్యలతో బిగ్ బాస్ 2 పై మరింతగా నెగిటివ్ ప్రచారం ఎక్కువయ్యే అవకాశం ఉంది.

 బిగ్ బాస్‌లో కూడా కాస్టింగ్ కౌచ్

బిగ్ బాస్‌లో కూడా కాస్టింగ్ కౌచ్

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాధవిలత మాట్లాడుతూ బిగ్ బాస్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని తెలిపింది. సినిమా పరిశ్రమకు సంబందించిన ఏ విషయంలో అయినా కాస్టింగ్ కౌచ్ ఉంటుందని మాధవీలత వ్యాఖ్యానించింది.

ఫోన్ చేసి అడిగేశాడు

ఫోన్ చేసి అడిగేశాడు

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సెలక్షన్ కమిటీలో కీలక వ్యక్తి తనకు ఫోన్ చేశాడని మాధవీలత తెలిపింది. అతడు ఫోన్ చేసి బిగ్ బాస్ లో అవకాశం ఉందని చెప్పాడు. మీకు ఒకే అయితే మనం ఎంజాయ్ చేద్దాం అని అడిగేసినట్లు మాధవీలత తెలిపింది. అతడి ఉద్దేశం తెలియడంతో తాను బిగ్ బాస్ కు వెళ్లలేదని మాధవీలత తెలిపింది.

దాదాపు 20 నిమిషాలు

దాదాపు 20 నిమిషాలు

అతడు ఫోన్ చేసి దాదాపు 20 నిమిషాలు మాట్లాడాడని మాధవీలత తెలిపింది. ఈ సారి బిగ్ బాస్ లో మంచి మసాలా యాడ్ చేస్తున్నాం. ఇష్టమైతే ఎక్స్ ఫోజింగ్ చేసేలా దుస్తులు వేసుకోవచ్చు అని ఫోన్ లో చెప్పాడు.

సింగిల్‌గా ఉన్నావు కదా

సింగిల్‌గా ఉన్నావు కదా

నేను కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా పోరాటం చేశా. ఎవరికీ ఫోన్ చేసి ఏవిషయం అడుగుతున్నావు అని అడిగా. దానికి అతడు ఇచ్చిన సమాధానం.. ఇది కాస్టింగ్ కౌచ్ కాదు మాధవి, కానీ నువ్వు సింగిల్ గా ఉన్నావు.. నీకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి అని అడిగాడు.

అమ్మాయిలే ఫోన్ చేసి

అమ్మాయిలే ఫోన్ చేసి

బిగ్ బాస్ కూడా కాస్టింగ్ కౌచ్ కు అతీతం కాదని మాధవీలత తెలిపింది. చాలా మంది అమ్మాయిలే ఫోన్ చేసి మేము రెడీ అని చెబుతున్నట్లు తనకు తెలిసిందని తెలిపింది. అవకాశాల కోసం అమ్మాయిలు ఆశపడతారని కాబట్టి వారిని తాను తప్పు బట్టనని మాధవీలత తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X