twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా చేసిన హీరో, పొలిటీషియన్‌ను ఇంతవరకు చూడలేదు.. పవన్‌పై మాధవీలత సెన్సేషనల్ కామెంట్స్

    |

    పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ అందరూ సంతోషంలో మునిగిపోయారు. కానీ ఓ ముగ్గురు అభిమానులు మాత్రం దుర్మరణం చెందారు. కుప్పంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకల్లో భాగంగా ఫ్లెక్సీలు కడుతున్న వారు.. విద్యుత్ తీగలకు తగిలి మరణించారు. వీరి మరణంపై పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిచెందారు. ముగ్గురు అభిమానులు చనిపోయారని తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశాడు. దానిపై మాధవీలత చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

    లేని లోటు తీర్చలేను..

    లేని లోటు తీర్చలేను..

    ఇది మాటలకు అందని విషాదం.. ఆ తల్లిదండ్రుల గర్భ శోకాన్ని అర్థం చేసుకోగలను. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను. కనుకు ఆ తల్లిదండ్రులకు నేను ఒక బిడ్డగా నిలుస్తాను. ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకొంటాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశాడు.

     పీకే మార్క్..

    పీకే మార్క్..

    ఇక పవన్ కళ్యాణ్ అలా ప్రెస్ నోట్ వెంటనే విడుదల చేయడంపై మాధవీలత స్పందించింది. పీకే ఫ్యాన్స్‌కు చెబుతున్నా.. ఇతర ఏ హీరోలు గానీ, రాజకీయ నాయకులు గానీ ఇంత త్వరగా రియాక్ట్ అయిన వారిని ఈ రోజు వరకు ఎప్పుడూ చూడలేదు. బహిరంగంగా, అధికారికంగా ప్రకటన చేయడం.. ఎవ్వరూ చేయలేదు.. అదే పీకే మార్క్ అంటూ పవన్‌పై ప్రశంసలు కురిపించింది.

    చివరకు చెడ్డ పేరు..

    చివరకు చెడ్డ పేరు..

    పవన్ కళ్యాణ్ ప్క్ష్యాన్స్‌కు నా తరుపు నుంచి ఓ విన్నపం.. మీరంతా ఆయన్ను ఇష్టపడుతుంటారు.. కానీ మీ అంతట మీరే సమస్యలో చిక్కుకుంటున్నారు. మీ జీవితాన్ని మీరే కోల్పోతున్నారు.. కానీ చివరకు మాత్రం పీకేకు చెడ్డ పేరు వస్తోంది. ఎందుకిలా?.. ఆయన ఎన్నడూ ఏదీ అడగలేదు. ఆయన పేరును చెడగొట్టకండి అంటూ మాధవీలత కోరింది.

    Recommended Video

    Madhavi Latha Reacts On Sushant's సూసైడ్ And How The Depression ఎఫెక్ట్స్
    మెగా హీరోల ఆర్థిక సాయం..

    మెగా హీరోల ఆర్థిక సాయం..

    మృతుల కుటుంబాలకు నిర్మాణ సంస్థలు, మెగా హీరోలు ఆర్థిక సాయాన్ని చేశారు. అల్లు అర్జున్, మైత్రీ మూవీస్, మెగా సూర్య, దిల్ రాజు ప్రొడక్షన్స్ వారు రెండు లక్షల చొప్పున, రామ్ చరణ్ 2.5లక్షల చొప్పున ఆర్థిక విరాళాన్ని ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

    English summary
    Madhavi Latha About Pawan Kalyan Condolences To Fans Died In Kuppam. To PK Fans Instant Response TILL DATE i never ever seen No HERO NO OTHER POLITICIAN
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X