»   » దేవుళ్లు చేసుకోలేదా? పవన్ కళ్యాణ్ మూడో పెళ్లిపై మాధవి లత హాట్ కామెంట్స్!

దేవుళ్లు చేసుకోలేదా? పవన్ కళ్యాణ్ మూడో పెళ్లిపై మాధవి లత హాట్ కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pawankalyan Get Supproted By Actress Madhavi Latha

ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్‌ మీద కొందరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నోళ్లు కూడా సమాజ సేవ చేస్తారా? అంటూ వెటకారం చేస్తున్నారు. రెండు మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ హాట్ టాపిక్ అయిన హీరోయిన్ మాధవి లత... ఆయన 3 వివాహాలపై కూడా స్పందించారు.

రేణు దేశాయ్‌కి అన్యాయం, మోసం జరిగి ఉంటే...

రేణు దేశాయ్‌కి అన్యాయం, మోసం జరిగి ఉంటే...

పవన్ కళ్యాణ్ లీగల్‌గా అందరికీ విడాకులు ఇచ్చేసే మూడో పెళ్లి చేసుకున్నారు. ఆయన నిజంగా అన్యాయం చేసి ఉంటే, మోసం చేసి ఉంటే రేణు దేశాయ్ ఇప్పటికీ అంత గౌరవంగా ఎందుకు మాట్లాడుతుంది? నో కామెంట్స్ అని ఒకటే మాట చెప్పేది. ఆమె ఏ రోజూ అలాంటి వర్డ్స్ యూజ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు ఆమె చాలా ఎగ్జైట్ అవుతారు.... అని మాధవి లత తెలిపారు.

కొందరి జీవితాలు అంతే

కొందరి జీవితాలు అంతే

ఒక్కోక్కరి లైఫ్ లో ఒక్కో సిచ్యువేషన్ ఉంటుంది. కొంత మంది భార్యభర్తలుగా అన్యోన్యంగా ఉండలేక పోవచ్చు. స్నేహితులుగా ఎంతో గొప్పగా ఉండొచ్చు. కంపానియన్ కుదరకనే ఇలా జరుగుతుంటుంది, కొన్ని జీవితాలు అంతే.... అని మాధవి లత తెలిపారు.

వారు ఇల్లీగల్‌గా పదేసి సంసారాలు మెయింటేన్ చేస్తున్నారు

వారు ఇల్లీగల్‌గా పదేసి సంసారాలు మెయింటేన్ చేస్తున్నారు

అలా మాట్లాడుకుంటే మన రాజకీయ నాయకులు ఒక్క పెళ్లి చేసుకుని పది సంసారాలు మెయింటేన్ చేస్తున్నవారు ఉన్నారు. దాన్నేమంటారు? ఇవన్నీ అందరికీ తెలిసినవే. వారి పీఏలు, వారి అసిస్టెంట్లు, డ్రైవర్లు ఏయే ఇంటికి ఏమేం తీసుకెళుతున్నారు, ఏయే సరుకులు పట్టుకెళుతున్నారు, ఏ డబ్బులు ఎవడిస్తే ఎక్కడికి తీసుకెళ్లి ఇస్తున్నారు అనేది ఎవరికీ తెలియనివేంకాదు. అంటే వాళ్లు ఇల్లీగల్‌గా చేస్తే తప్పులేదా? పవన్ కళ్యాణ్ అఫీషియల్ గా చట్టప్రకారం విడాకులు ఇచ్చి చేస్తే తప్పా?... అంటూ మాధవి లత ప్రశ్నించారు.

దేవుళ్లు చేసుకోలేదా?

దేవుళ్లు చేసుకోలేదా?

దేవుళ్లు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోలేదా? అలా అని పవన్ కళ్యాణ్‌ను నేను దేవుడు అనడం లేదు, ఆయన మంచి మనిషి... సమాజానికి మంచి చేయాలనుకుంటున్న మనిషి... దేవుడు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు అంటే కొందరు సందర్భం అలా కలిసొచ్చింది చేసుకున్నారని చెబుతుంటారు. పవన్ కళ్యాణ్‌కు కూడా అలాంటి సందర్భం కలిసొచ్చిందేమో? అక్కడ దేవుడు ఎవరికీ విడాకులు ఇవ్వలేదు. ఒకరు ఉండగానే ఇంకొకరిని చేసుకున్నారు... అని మాధవి లత అన్నారు.

అంత గొప్పదాన్ని కాదు

అంత గొప్పదాన్ని కాదు

నువ్వు దేవుడు గురించి మాట్లాడేంత గొప్ప దానివా అంటే... కాదు, పవన్ కళ్యాణ్‌ను నువ్వు దేవుడితో పోలుస్తావా? అంటూ దేవుడిని ఆరాధించే వారికి కోపం రావొచ్చు, కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి పద్మావతిని ఉంచి లక్ష్మీ దేవిని పెళ్లి చేసుకోలేదా? మరి ఆమెకు కోపం వచ్చి జరిగిన గొడవలోనే కదా ఈయన శిలగా మారిపోయారు. అంటే ప్రపంచంలో దేవుడికైనా ఇద్దరి భార్యల మధ్య ఇరుక్కుంటే నలిగిపోతారు, కలియుగం ఇలా నడవాలి అనే చెప్పడానికే సింబాలిక్ గా మన పురాణాల్లో అలా చెప్పారు. దాని మీద నేను ఏమీ కామెంట్ చేయడం లేదు. ఇపుడు మనకు రోడ్డుమీద ఏదైనా చిన్న హెల్ప్ అవసరం అయినపుడు ఒక మనిషి వచ్చి సహాయం చేయగానే అబ్బా దేవుడులా వచ్చారు అంటాం. మంచి చేయడానికి వచ్చారు కాబట్టి వారిని దేవుడు అంటాం అని మాధవి లత అన్నారు.

English summary
Actress Madhavilatha said that Pawan Kalyan married all the three legally. His second and third marriages happened only after getting the divorce. She further said that Pawan and his ex-wife Renu Desai are still good friends.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X