»   » మాధవీలత మరోమారు..పవన్ ఫాన్స్‌కు సూచన, నా మనసులో పవన్ ఉంటాడా లేదా, అదే ఫైనల్!

మాధవీలత మరోమారు..పవన్ ఫాన్స్‌కు సూచన, నా మనసులో పవన్ ఉంటాడా లేదా, అదే ఫైనల్!

Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో శ్రీరెడ్డి పోరాటం ముదిరి పాకాన పడుతోంది. హీరోయిన్ మాధవీలత కూడా టాలీవుడ్ లో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి కొందరు ప్రముఖుల పేర్లు బయట పెడితే, మాధవీలత కూడా తనకు ఎదురైన చెడుఘటనలని మీడియాతో పంచుకుంది. టాలీవుడ్ లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా కొనసాగుతున్న సమయంలో శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం మరింతగా సెగలు రేపుతోంది. నిజం బయటకు వస్తుంది అంటూ సోషల్ మీడియాలో మాధవీలత ఇటీవల పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యల తరువాత మాధవీలత మరో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు సూచనలా ఉంది.

Pawan kalyan Get Supported By Madavi Latha
తనకు ఎదురైన ఘటనలతో మాధవీలత

తనకు ఎదురైన ఘటనలతో మాధవీలత

శ్రీరెడ్డి గత కొన్నిరోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తూ టాలీవుడ్ ప్రముఖుల గురించి సంచలన విషయాలు బయటపెడుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ మాధవీలత కూడా ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలని వెల్లడించి కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపు ఇచ్చింది.

పెరిగిన తీవ్రత

పెరిగిన తీవ్రత

శ్రీరెడ్డి సోమవారం వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ అగ్గిమీద గుగ్గిలంలా ఉన్నారు. శ్రీరెడ్డి వ్యవహారం మరింతగా హాట్ టాపిక్ అయింది.

నిజం పవన్ బయట పెడతారు

నిజం పవన్ బయట పెడతారు

పవన్ కళ్యాణ్ కు నిజం తెలుసు అని ఆయన అన్ని విషయాలు బయట పెడతారని ఇటీవల మాధవీలత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మాధవీలత సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

మాధవీలత మరో మారు

మాధవీలత మరో మారు

శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తిడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన అనంతరం మాధవి లతా మరోమారు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టింది. ఈ కామెంట్లు పవన్ కళ్యాణ్ అభిమానులకు సూచనలా ఉన్నాయి.

మొన్నే చెప్పాను మీకు

మొన్నే చెప్పాను మీకు


పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలతో మాట్లాడిన ఓ వీడియోని పోస్ట్ చేసిన మాధవీలత పవన్ కళ్యాణ్ అభిమానులని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. భరించండి.. సహించండి.. మొన్నే చెప్పను మీకు.. నిజం మొదట వ్యతికించబడుతుంది, వెక్కిరించబడుతుంది.. ఎగతాళి చేయబడుతుంది.

 యాంటీ ఫాన్స్ తిడుతున్నారు

యాంటీ ఫాన్స్ తిడుతున్నారు

తనని పవన్ కళ్యాణ్ యాంటీ ఫాన్స్ తిడుతున్నారని మాధవీలత తెలిపింది. ఆయన పరవాలేదు. నిజమే గెలుస్తుంది అంటూ మాధవీలత తెలిపింది.

జనసేనలో ఉండడం కాదు

జనసేనలో ఉండడం కాదు

తాను జనసేనలో ఉంటానా లేదా అనే విషయం కాదని, తన మనసులో పవన్ కళ్యాణ్ ఉంటాడా లేదా అనేదే ఫైనల్ అని మాధవీలత తెలిపింది. భరించండి, సహించండి.. మీ సహనమే విజయాన్ని తెచ్చిపెడుతుంది అని మాధవీలత తెలిపింది.

నిజమైన పవన్ ప్రేమికులు అయితే

నిజమైన పవన్ ప్రేమికులు అయితే

మీరంతా నిజమైన పవన్ కళ్యాణ్ ప్రేమికులు అయితే సైలెంట్ గా ఉండండి అంటూ మాధవీలత తన పేస్ బుక్ పేజీలో పోస్ట్ పెట్టింది. పవన్ పై శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసిన అనంతరం మాధవీలత ఈ పోస్ట్ పెట్టడంతో ఇది శ్రీరెడ్డికి కౌంటర్ అని అంటున్నారు.

English summary
MadhaviLatha appeal to all Pawan Kalyan fans. She made sensational comments in social media
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X