'ఎక్స్ పోజింగ్' కు రెడీ
'నచ్చావులే' చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైన తెలుగమ్మాయి మాధవీ లత. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకోవడమే కాకుండా బాగా నటించింది అని పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన 'స్నేహితుడా' చిత్రంలో కూడా మంచి మార్కులే కొట్టేసింది.
తన మొదటి రెండు చిత్రాల్లోనూ 'పక్కింటి అమ్మాయి' తరహా పాత్రలు పోషించిన మాధవి, ముంబై హీరోయిన్ల నుంచీ ఎదురయ్యే పోటీని తట్టుకొనేందుకు హాట్ హాట్ గా కనిపించేందుకు సిద్ధమవుతోందట. దీనికోసం ప్రత్యేకంగా ఫోటో సెషన్లకు సిద్ధమవుతోందట. మొదటి రెండు చిత్రాలలో నటిగా మంచి పేరు వచ్చిందని, గ్లామర్ పరంగా కూడా మంచి మార్కులు కొట్టేయాలనుకొంటున్నానని మాధవి చెబుతోంది.
ఈ గ్లామర్ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే 'ఎక్స్ పోజింగ్' చెయ్యకతప్పదని ముందుగానే గ్రహించిన మాధవి ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











