twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంతమంది దరిద్రులున్నారో.. దేశాన్ని పాలించే ఆయనకు మొక్కాలి.. మాధవీలత ఫైర్

    |

    మాధవీలత తాజాగా ఓ పోరాటాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కరెంటు బిల్లుల్లో తప్పులను ఎత్తి చూపెడుతూ తన పోరాటాన్ని ప్రారంభించింది. లాక్డౌన్‌లో కొందరు సెలెబ్రిటీలు కరెంటు బిల్లులను చూసి షాక్ అయ్యారు. కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అంతటా ఇదే సమస్య ఉత్పన్నమైంది. మూడు నెలల బిల్లులు ఒకేసారి కొట్టడం, అందులో ఎన్నో తప్పులు రావడంతో పూరి గుడిసెలో ఉన్నవారికి సైతం వేలల్లో బిల్లు వచ్చింది. తాజాగా మాధవీలత తన కరెంట్ బిల్లుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

    మళ్లీ కట్టించుకున్నారట..

    మళ్లీ కట్టించుకున్నారట..

    మాధవీలతకు రూ. 7500 కరెంట్ బిల్ వచ్చిందట. దాన్ని ఎయిర్‌టెల్ యాప్ ద్వారా పే చేసిందట. మళ్లీ కట్టాలని బిల్ చూపడంతో మళ్లీ పే చేసిందట. అయితే తన డబ్బులు ఎవరు తిన్నారు? ఎటు పోయాయ్ అంటూ తన బ్యాంక్, ఎయిర్‌టెల్, విద్యుత్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేటీఆర్, కేసీఆర్‌ను ప్రశ్నించింది. ఈ మేరకు మాధవీలత చేసిన పోస్ట్‌పై కొందరు ఫైర్ అయ్యారు.

     నెగెటివ్ కామెంట్స్..

    నెగెటివ్ కామెంట్స్..

    ఇలా తన డబ్బులు తనకు చెల్లించాల్సిందేనని పోస్ట్ పెట్టడంతో మాధవీలతపై కొందరు ట్రోలింగ్ చేశారు. మాధవీలతను నెగెటివ్ కామెంట్లతో దూషించారు. న్యాయం అడిగితే కూడా ఇలా తనపై నెగెటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేయడంపై మాధవీలత సెటైర్ వేసింది.

    మింగి కూర్చుని..

    మింగి కూర్చుని..

    ఇది నా ఒక్కదాని సమస్య కాదే ప్రజల సమస్య. ఇది అడిగితే నా వాల్‌లో ఇంతమందికి కాలింది. అంటే వీళ్లందరూ ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారు, అమ్మా నాన్న పెడుతుంటే మింగి కూర్చుని ఇంత ఖాళీగా ఉన్నారు. అసలు పవర్ బిల్ కట్టే విషయంలో పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో తెలియని వాళ్లే సగం.. ఉద్దెర సొమ్ము తినేవాళ్లు సగం అంటూ మాధవీలత కౌంటర్ వేసింది.

    Recommended Video

    Madhavi Latha Controversial Post Viral On Celebrities Marriages In Lockdown
     నా పైసల్ నాకు కావాలి..

    నా పైసల్ నాకు కావాలి..

    కర్మరా నాయనా.. ఈ దేశాన్ని పాలించే ఆయనకు మొక్కాలి ఇంత దరిద్రులున్నారి ఉఫ్.. ప్రజల సమస్య అడిగితే కూడా ఇంతమందికి మండింది అంటే.. ఎంత బేవార్స్‌గాల్లు ఉన్నారో.. అర్థమైంది. ఐనా సరే నా పైసల్ నాకు కావాలి'అని చెప్పుకొచ్చింది. మరి మాధవీలత డబ్బులు ఎక్కడికి పోయాయ్? ఎవరి చెల్లిస్తారో? చూడాలి.

    English summary
    Madhavi Latha Fires Netizens On Electricity Bill Trolling, Madhavi Latha Fires On Electricity Bill Payment, Proofs will be submitted to bank. Airtel team, And electricity department
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X