నా డబ్బులు ఎవరు మింగారు!.. వామ్మో విశ్వరూపం చూపించిన మాధవీలత
ఆ మధ్య లాక్‌డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులు చూసి అవాక్కైన వారెంతో మంది ఉన్నారు. పూరి గుడిసెలో ఉన్నవారికి కూడా వేలకు వేల బిల్లులు వచ్చాయి. సామాన్యులు, సెలెబ్రిటీలు అని తేడా లేకుండా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని తేడా లేకుండా కరెంబ్ బిల్లులు చూసి షాకైన వారెంతో మంది ఉన్నారు. అవి ఓ రకమైన సమస్యలైతే ఆన్‌లైన్‌లో బిల్లులు కడితే అవి చూపించకపోవడం మరో సమస్య. ప్రస్తుతం మాధవీలతకు అలాంటి సమస్యే ఎదురైనట్టుంది.

కరెంట్ బిల్లులు..
ఆంధ్ర తెలంగాణ ఎక్కడ తగ్గడం లేదు,కరెంటు బిల్లులు . మే నెలలో 7500 బిల్లు కట్టాను ఎయిర్టెల్ యాప్ లో . కానీ కరెంటు బిల్లు కట్టలేదని మళ్ళీ 7500 కట్టించుకున్నారు . సరే అని క్రెడిట్ కార్డు వాళ్ళకి బ్యాంకు వాళ్ళు మెయిల్ పెడితే మేము ఎయిర్టెల్ కి పే చేసాము అన్నారు . ఎయిర్టెల్ వాళ్ళకి మెయిల్ పెడితే సాక్షాలతో సహా మెయిల్ పంపుతూ బిల్లు కట్టాము అన్నారని మాధవీలత పేర్కొంది.

ఎవరు మింగారు..
మరి నా 7500 ఎవరు మింగారు? . ఎంతమంది బిల్లులు మింగుతారు . నేను హైదరాబాద్ లో ఉన్నాను కనుక నేను ఉన్న ప్రభుత్వాన్నే అడుగుతున్నా . పవర్ బిల్లు కట్టలేదు అని మల్లి కట్టించుకున్న వాడ . వాడితో కుమ్మక్కై ప్రజల మీద బిల్లులు రుద్దే ప్రభుత్వాలదా .ఇపుడు నా 7500 ఎవడు ఇస్తారు. డబ్బులెవరికి ఊరికే రావు సర్ అని మాధవీలత పేర్కొంది.

ఏడికిపోయినయ్..
ప్రతి రూపాయి విలువైనదే. అంటే నీలి రంగు గులాబీ రంగు వాడికి మండుద్ది , ఒకవేళ అంత మండితే నా 7500 నాకు ఇచ్చి అపుడు . పెట్రోల్ పోసుకుని మరి మంట తెచ్చుకుని అరవండి
కానీ నా పైసల్ నాకు కావాలె . వాడు తినలే వీడు తినలే మరి నా పైసల్ ఏడికి పోయినయి ??? ఇలా ఇప్పటికే చాలామంది మీద బిల్లులు మోపారు అంటూ మాధవీలత ఆరోపించింది.
Recommended Video

పైసల్ కావాలి..
డబల్ ధమాకాలు మోపుతున్నారు . ఐన కడుతున్నాం . ఏమో నాకు తెల్వదు . నా పైసల్ నాకు కావాలి ఎవరిస్తారు. మూడు నెలలు గడిచాయి. అన్ని రకాలుగా ప్రయత్నించాను అంటూ కేసీఆర్, కేటీఆర్, ఎలక్ట్రిసిటీ బోర్డ్‌ను మాధవీలత ప్రశ్నించింది. మామూలుగా సోషల్ మీడియాలో దుమ్ముదులిపే మాధవీలతా ఈ విషయంలో మాత్రం టెంపర్ కోల్పోయినట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











