మహేష్ కత్తిని చెప్పుతో కొడుతా.. దుర్మార్గాల వల్లనే వాడిని భార్య వదిలేసింది.. మాధవీలత
Recommended Video

ఒకవేళ సీత రావణుడి దగ్గర ఉండి ఉంటే ఎంజాయ్ చేసేదేమో అని మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యలపై సినీ నటి మాధవీలత మండిపడింది. కత్తి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా దుయ్యబట్టింది. ఒకవేళ ముస్లిం, క్రిస్టియన్, ఇతర మతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే పరిస్థితి మారోలా ఉండేది అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే..

వీడెవ్వడు సీతను అనడానికి
తరాలు, యుగాలు మారినా ఇప్పటికీ మహాసాధ్వీ సీతమ్మనే భారతీయ మహిళలు స్ఫూర్తిగా తీసుకొంటారు. రావణుడి దగ్గర ఉండాలి అని అనడానికి వీడు (కత్తి మహేష్) అని మాధవీ లత ఫైర్ అయ్యారు. సీతమ్మ ఎక్కడ ఉండాలని నిర్ణయించడానికి వీడెవ్వడూ అని తీవ్రంగా స్పందించారు.

భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో
సాధారణంగా నేను టెలివిజన్ చర్చలో ఒకరిని వీడు, వాడు అని మాట్లాడను. కానీ మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యల వల్ల వీడు అని మాట్లాడాల్సి వస్తున్నది. హిందు మతంలో ఉండే స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవేళ వేరే మతంపై ఇలాంటి వాఖ్యలు చేస్తే ఫత్వా జారీ చేసేవారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు అని మాధవీ లత పేర్కొన్నారు.

మహేష్ కత్తి దుర్మార్గాలు
మహేష్ కత్తి చేసే దుర్మార్గాలను భరించలేకనే ఆయన భార్య వదిలేసి వెళ్లింది. అలాంటి వ్యక్తి హిందు దేవుళ్లపై, సీతమ్మపై వ్యాఖ్యాలు చేస్తారా? రామాయణాన్ని కథగా భావిస్తే ఆయన వ్యక్తిగతం.. కానీ పబ్లిక్‌గా మాట్లాడటం సరికాదు. ఎన్నో తరాలు రామాయణాన్ని గౌరవిస్తూ వస్తుంటే ఇప్పుడు వీరు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నాడు.

బాబు గోగినేనిపై మాధవీలత ఫైర్
వెంకటేశ్వర సుప్రభాతాన్ని బూతు అని వ్యాఖ్యలు చేసిన బాబు గోగినేనిపై కూడా మాధవీలత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుడిపై రేప్ కేసు పెట్టాలని వ్యాఖ్యలు చేసిన గోగినేనిపై మండిపడ్డారు. ఒకవేళ హైకోర్టు నుంచి నోటీసుల తెస్తే శ్రీకృష్ణుడిని ఎక్కడ నుంచి పట్టుకొస్తారు. నెగిటివిటి ప్రచారం చేయడానికే బాబు గోగినేని, మహేష్ కత్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని మాధవి లత అన్నారు.

కత్తి మహేష్‌ని చెప్పుతో కొడుతా
రావణుడితో సీత ఎంజాయ్ చేయాలన్న మహేష్ కత్తిని చెప్పుతో కొడుతాను. వీడు ఎవడూ అలా చెప్పడానికి? వీడి జీవితమా? వాడి భార్య ఆయనను వదిలేసి వెళ్లింది. వీడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో తెలుసు. ఇలాంటి దుర్మార్గుడి ఉండలేకనే కత్తి భార్య వెళ్లిపోయారు. ఇంకా లీగల్‌గా డైవోర్స్ కూడా తీసుకోలేదు.
మహిళకు గౌరవం ఇవ్వలేదనే కారణంతోనే దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వ్యక్తి పురాణాలు, సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? అని మాధవి లత దుయ్యబట్టారు.


Click it and Unblock the Notifications











