twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    1.26లక్షల అకౌంట్స్ తీసేశాం.. పిచ్చి కామెంట్స్ పెడితే.. హెచ్చరించిన మాధవీలత

    |

    మాధవీలత సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఫేమస్. చేసిన కొన్ని సినిమాలు మంచి పేరునే తీసుకొచ్చినా అవకాశాలను మాత్రం తెచ్చిపెట్టలేకపోయాయి. దీంతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చింది. అయితే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ.. సమకాలీన అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. సినీ రాజకీయ అంశాలపై నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె తనపై వచ్చే నెగెటివ్ కామెంట్స్, అదేపనిగా టార్గెట్‌ చేసే నెటిజన్లపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

    సోషల్ మీడియాలో యాక్టివ్..

    సోషల్ మీడియాలో యాక్టివ్..

    మాధవీలత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. సమాజం, సినీ పరిశ్రమలో జరిగే అన్యాయాలపై పోస్ట్‌లు చేస్తుంటుంది. పార్టీ కార్యకలాపాలు, సమజ సేవకు సంబంధించిన వివరాలను కూడా తెలుపుతుంది. అయితే ఆమె చేసే పోస్ట్‌లు ఒక్కోసారి ఎంతో వివాదానికి తెరలేపుతాయి. నాలుగైదు రోజుల క్రితం ఆమె చేసిన ఓ పోస్ట్ పెను సంచలనంగా మారింది.

     పెళ్లి అంటూ వార్తలు..

    పెళ్లి అంటూ వార్తలు..

    కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను.. ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నానని ఓ పోస్ట్ చేసింది. దీంతో మాధవీలత పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం జరిగింది. ఈ వార్తలు మీడియాలో ప్రముఖంగా వినిపించాయి. దీంతో ఈ వార్తలపై స్పందిస్తూ అందరికీ క్లారిటీ ఇచ్చింది.

    ఖండిస్తూ మరో పోస్ట్..

    ఖండిస్తూ మరో పోస్ట్..

    మీడియా వారే నా పెళ్లిచేసేట్టున్నారని సెటైర్స్ వేస్తూ.. ఆ వార్తలన్నీ అవాస్తమని ఖండించింది. ఒక వేళ తాను పెళ్లి చేసుకుంటే ధైర్యంగా అందరికీ చెప్పే చేసుకుంటానని, దొంగ చాటున చేసుకోనని తెలిపింది. దీంతో పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పడింది.

    Recommended Video

    Is Madhavi Latha Going To Get Marry ? Post Gone Viral
    పిచ్చి కామెంట్స్ పెడితే..

    పిచ్చి కామెంట్స్ పెడితే..

    సోషల్ మీడియా అన్నాక నెగెటివ్ కామెంట్స్ వచ్చి తీరుతాయి. దీనిపై స్పందిస్తూ.. విమర్శిస్తే ఓకే కానీ ఇష్టం వచ్చినట్టు తిడితే కుదరదని తెలిపింది. తనది వెరిఫైడ్ ఖాతా అని, ఇప్పటి వరకు 1.26లక్షల అకౌంట్స్ తీసేశామని, పిచ్చి కామెంట్స్ పెడితే బ్లాక్ చేస్తానని హెచ్చరించింది.

    English summary
    Madhavi Latha Fires On Netizens Over Negative Comments. she says that Criticism is fine filthy abusive is offensive
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X