అది నా ఇష్టం.. ప్రతీ ఒక్కటి అలా ఉండాల్సిన పని లేదు.. ట్రోల్స్‌పై మాధవీలత ఫైర్

సినిమా హీరోయిన్‌గా మాధవీలత ఎంత పాపులర్ అయిందో.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అంతే క్రేజ్ తెచ్చుకుంది. నచ్చావులే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మాధవీలత తెలుగు ప్రేక్షకులను పలకరింది. ఆపై సరైన సక్సెస్ రాక.. అడపాదడపా చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకు అంతగా పేరు రాలేదు. దీంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ అంశంలో మాధవీలత బాగానే హైలెట్ అయింది.

 ఏదో ఒక పోస్ట్..

ఏదో ఒక పోస్ట్..

క్యాస్టింగ్ కౌచ్, మీటూ, శ్రీ రెడ్డి వ్యవహారం జోరుగా ఉన్నప్పుడు మాధవీలత చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మాట్లాడటంతో ఆయన ఫ్యాన్స్‌కు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉంటుంది. అయితే ఏనాడూ హద్దులు దాటి కామెంట్స్ చేయలేదు. ఈ మధ్య వరుసగా పోస్ట్‌లు పెడుతూ హల్చల్ చేస్తోంది.

 ఆ ఇద్దరిపై సెటైర్స్..

ఆ ఇద్దరిపై సెటైర్స్..

ఈ మధ్య మాధవీలత చిత్రపురి కాలనీ, సాధినేని యామిని విషయంలో చేసిన పోస్ట్‌లు తెగ వైరల్ అయ్యాయి. చిత్రపురి కాలనీలో జరిగే అన్యాయల గురించి ఓ పోస్ట్ చేసింది. సాధినేని యామినిపై ఫైర్ అవుతూ బీజేపీ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఈ విషయంలో శ్రీ రెడ్డి తలదూర్చి యామినేనికి మద్దుతుగా నిలిచింది. ఇక మాధవీలత శ్రీరెడ్డిల మధ్య పరోక్ష మాటల యుద్దం జరిగిన సంగతి తెలిసిందే.

నెటిజన్లకు సలహాలు..

ప్రస్తుతం అందరూ లాక్ డౌన్ కారణంగా.. అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. అందులో ఎక్కువగా నిత్యం ఫోన్లను పట్టుకుని సోషల్ మీడియాను వాడుతూ ఉన్నారు. దీనిపై స్పందిస్తూ నెటిజన్లకు సలహాలు ఇచ్చింది. ‘సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వాడటం లో తప్పు లేదు. మన భావాలు వ్యక్తపరచడం లో తప్పు లేదు వేరే వారి సందేశాలు చూడటం లో తప్పు లేదు కేవలం ఒక 30 నిముషాలు చాలు అదే పనిగా ఇంకా పనేమీ లేనట్లు పత్యపారం చేస్తే.. వచ్చే సుఖమేమో కానీ కళ్లు దొబ్బుతాయి. కనపడక కళ్లజోళ్లు ఎట్టుకోవాలి.. లేనిపోని మాయరోగాలు వస్తాయి మెదడు దెబ్బతింటుంద'ని తెలిపింది.

తాజాగా ట్రోల్స్‌పై ఫైర్..

తాజాగా ట్రోల్స్‌పై ఫైర్..

తన పోస్ట్‌లపై నెగెటివ్ కామెంట్ చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ.. ‘నేనో నటిని, కార్యకర్తని, సామాజిక కార్యకర్తని, వక్తను, రెబల్‌ను, రాజకీయ నాయకురాలిని ఎన్నో రంగాలకు చెందిన వ్యక్తిని. నా ఫేస్‌బుక్‌లో నేనేమ్ చేస్తానో అది నా ఇష్టం.. కొన్ని సార్లు అది హాస్యానికి సంబంధించినది కావచ్చు.. ఇంకొన్నిసార్లు స్ఫూర్తినింపేదికావచ్చు.. ఇలా ఏదైనా కావొచ్చు. నాకు మీ ప్రశంసలు అక్కర్లేదు.

Recommended Video

Video Of Rishi Kapoor Blessing Doctor Goes Viral | Filmibeat Telugu
ప్రతీదీ అలా ఉండాల్సిన పనిలేదు..

ప్రతీదీ అలా ఉండాల్సిన పనిలేదు..

నన్ను విసిగించడం ఆపేయండి.. నన్ను ఫాలో అయ్యేవారికి నేను చేసే పనులేంటో తెలియజేయాలనుకుంటున్నాను. అయితే ప్రతీది సమాజానికి ఉపయోగ పడే పోస్ట్‌లే కానక్కర్లేదు. మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే అన్ ఫాలో చేయండ'ని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X