ఐ లవ్ పవన్ కల్యాణ్.. ఆయనతో కలిసి కొనసాగుతానేమో.. మాధవీలత
తెలుగు పరిశ్రమలో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ మాధవీలత స్వచ్చంద కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. పేద ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు సహాయం అందించేందుకు నక్షత్ర ఫౌండేషన్ స్థాపించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా విరాళాల సేకరణ కోసం హైదరాబాద్‌లోని షాపింగ్ మాల్‌లో ఫ్లాష్ మాబ్ (డ్యాన్స్) నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడింది. ఏమన్నారంటే..

ఏరికోరి సినిమాలు చేస్తున్నా
నటిగా నాకు నచ్చే పాత్రలనే చేయాలని నిర్ణయించుకొన్నాను. అందుకే ఎక్కువ తెరపైన కనిపించడం లేదు. డబ్బుల కోసం నేను పాత్రలను ఒప్పుకోలేను. అందుకే ఏరికోరి సినిమాలు చేస్తున్నాను అని మాధవీ లత అన్నారు.

పేదలకు సహాయం చేస్తాను
పేదలు, వికలాంగులు, వృద్ధులను సమాజం సృష్టిస్తున్నది. వారికి అండగా నిలువాల్సిన అవసరం ఉందని గ్రహించాను. అందుకే నక్షత్ర ఫౌండేషన్‌ను స్థాపించాను. చిన్న మొత్తంలో విరాళాలు సేకరిస్తున్నాను. అందుకే ఫ్లాష్ మాబ్ నిర్వహిస్తున్నాం. నక్షత్ర ఫౌండేషన్ చేస్తున్న సేవ గురించి తెలియజెప్పాలని ప్రయత్నిస్తున్నాం.

పాలిటిక్స్‌తో ప్రజాసేవ
నాకు ఉన్న సమయంలో బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. రాజకీయాల ద్వారా ప్రజా సేవ చేయాలని నిర్ణయించుకొన్నాను. ఆ మేరకే చురుకుగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాను అని మాధవీ వెల్లడించారు.

పవన్ కల్యాణ్ అంటే ఇష్టం
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అంటే నాకు ఇష్టం. నేను ఆయన అభిమానిని. ఐ లవ్ పవన్ కల్యాణ్, ఐ ఆల్వేస్ లవ్ పవన్ కల్యాణ్. ఆయన జనసేన గురించి ఇప్పుడే చెప్పలేను. ఆయనతో కలిసి కొనసాగే అవకాశం లేకపోలేదు. ఏం జరుగుతుందో నేను చెప్పలేను అని మాధవీలత చెప్పింది.


Click it and Unblock the Notifications











